// // ATM Robbery: నిజామాబాద్‌లో ఏటీఎం దొంగల బీభత్సం.. ఒకేరోజు రెండు చోట్ల చోరీ.. -->
E-Paper
Advertisement

ATM Robbery: నిజామాబాద్‌లో ఏటీఎం దొంగల బీభత్సం.. ఒకేరోజు రెండు చోట్ల చోరీ..

ATM Robbery: నిజామాబాద్‌లో ఏటీఎం దొంగల బీభత్సం.. ఒకేరోజు రెండు చోట్ల చోరీ..
Advertisement

ATM Robbery: నిజామాబాద్ జిల్లాలో జరిగిన భారీ ఏటీఎం దోపిడీ ప్రస్తుతం తీవ్ర కలకలం సృష్టించింది. అత్యంత ప్రొఫెషనల్ పద్ధతిలో వ్యవహరించిన అంతర్రాష్ట్ర ముఠా, నగరాన్ని అల్లాడించింది. సాయి నగర్ లోని ఎస్‌బీఐ ఏటీఎం నుంచి సుమారు 10 లక్షల రూపాయలు, ఆర్యనగర్ లోని డీసీబీ ఏటీఎం నుంచి ఏకంగా 27 లక్షల రూపాయలను గ్యాస్ కట్టర్ల సాయంతో దోచుకున్నారు. ఈ క్రమంలో నిందితులు వాడిన గ్యాస్ కట్టర్ల వేడికి ఏటీఎంలోని కొంత నగదు కాలిపోయి బూడిదైనట్లు పోలీసులు గుర్తించారు.

ఈ దారుణానికి పాల్పడింది మహారాష్ట్ర లేదా రాజస్థాన్‌కు చెందిన ఐదుగురు సభ్యుల ప్రొఫెషనల్ ముఠా అయి ఉండవచ్చని డీసీపీ బస్వారెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. వీరు కేవలం దోపిడీ చేయడమే కాకుండా, ఆధారాలు లభించకుండా ఉండేందుకు ఏటీఎంలోని సీసీ కెమెరాలకు స్ప్రే పెయింట్ వేసినట్లు తెలుస్తుంది. నిందితులు పక్కా ప్లాన్‌తో వచ్చి, అతి తక్కువ సమయంలోనే పని ముగించుకొని పరారయ్యారు.

Advertisement

ఘటనపై సమాచారం అందిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తును ముమ్మరం చేశారు. కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర స్వయంగా సంఘటనా స్థలాలను పరిశీలించి, అధికారులకు దిశానిర్దేశం చేశారు. పట్టణంలోని ప్రధాన రహదారుల వెంట ఉన్న సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న క్లూస్ టీమ్, నిందితులు ప్రయాణించిన వాహనాన్ని గుర్తించే పనిలో ఉంది. ముఠా కదలికలను బట్టి వారు సరిహద్దు దాటి వెళ్లకుండా పక్క రాష్ట్రాల పోలీసులను కూడా తెలంగాణ పోలీసులు అప్రమత్తం చేశారు.

Also Read: మహబూబాబాద్‌లో హైటెన్షన్! ఒకే రోజు ఇద్దరు నాయకుల రాకతో హీటెక్కిన రాజకీయం 

Advertisement

అంతేకాకుండా ఈ కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించినట్లు అధికారులు తెలిపారు. సాంకేతిక ఆధారాలతో పాటు పాత నేరస్తుల రికార్డులను విశ్లేషిస్తున్నామని, త్వరలోనే నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాత్రి సమయాల్లో ఏటీఎంల వద్ద భద్రతా చర్యలు పెంచాలని బ్యాంక్ యాజమాన్యాలకు పోలీసులు సూచించారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×