E-Paper
Advertisement

Zaheerabad: జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఘోరం.. డాక్టర్లు లేక నర్సుల డెలివరీకి పసికందు మృతి!

Zaheerabad: జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఘోరం.. డాక్టర్లు లేక నర్సుల డెలివరీకి పసికందు మృతి!
Advertisement

Zaheerabad: స్వేచ్ఛ బ్యూరో: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఏరియా ఆస్పత్రిలో డాక్టర్లు గైర్హాజర్ కావడం, నర్సులే డెలివరీ చేయడంతో అప్పుడే పుట్టిన పసికందుకు ఆక్సిజన్ అందక మృతి చెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిలో చోటుచేసుకుంది. మృతి చెందిన పసికందు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం ఝరాసంగం మండలం పోట్పల్లి గ్రామానికి చెందిన మనోహర అనే మహిళకు నెలలు నిండి పురిటి నొప్పులు రాగా ఆదివారం డెలివరీ కోసం జహీరాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు.

ఆక్సిజన్ అందక..

హాస్పిటల్లో డాక్టర్లు లేకపోవడంతో నర్సులే డాక్టర్ల అవతారం ఎత్త డెలివరీ చేశారు. డెలివరీ అయిన తర్వాత పసికందుకు ఆక్సిజన్ అందడం లేదని అస్పత్రి లోని మొదటి అంతస్తుకు తీసుకెళ్లారు. అక్కడ ఆక్సిజన్ పెట్టె సిబ్బంది ఎవరు లేకపోవడంతో పసికందుకు సరిగ్గా ఆక్సిజన్ అందకుండా పోవడంతో ప్రాణాలు వదిలింది. ఆసుపత్రి సిబ్బంది, నర్సుల నిర్లక్ష్యం వల్ల తమ బిడ్డ బలైందని పసికందు బంధువులు తెలిపారు. ఆస్పత్రి నర్సులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్ల మరణించిందని పసికందు కుటుంబ సభ్యులు ఆరోపిస్తు ఆస్పత్రి ముందు ఆందోళన చేపట్టారు. ఉదయం నుండి తాము ఆస్పత్రి సిబ్బంది కి పసికందు కు ఆక్సిజన్ అందడం లేదని చెప్తున్నా వినిపించుకోలేదని వారు వాపోయారు.

Advertisement

Also read: PDS Rice: హుజూరాబాద్‌లో అక్రమ రేషన్ బియ్యం దందా కలకలం

పసికందు మృతి..

ఇక్కడ డాక్టర్లు లేరని తమకు రాసిస్తే వేరే ఆస్పత్రికి వెళ్తాము అన్న వినకుండా తమను వెళ్ళనియకుండా నర్సులు పసికందు ప్రాణాలు బలి తీసుకున్నారని ఆరోపించారు. ఆస్పత్రిలో నర్సుల నిర్లక్ష్యం వల్ల పసికందు మృతి చెందింది అన్న విషయం తెలుసుకున్న బీజేపీ, బిఆర్ ఏస్ నాయకులు అస్పత్రి సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు. విషయం తెలుసుకున్న జహీరాబాద్ పట్టణ ఏస్ఐ లవకుమార్ తన సిబ్బదితో అస్పత్రి కి చేరుకొని వారికి నచ్చ చెప్పి పంపించేశారు. జహీరాబాద్ ఎమ్మెల్యే కే.మాణిక్ రావు, మాజీ డిసిఎంఎస్ చైర్మన్ మల్కాపురం శివకుమార్ హాస్పిటల్ కు చేరుకొని మృతి చెందిన పసికందు కుటుంబాన్ని పరామర్శించారు. జిల్లా వైద్యాధికారులతో ఎమ్మెల్యే మాట్లాడి జైరాబాద్ హాస్పిటల్ పరిస్థితిని వివరించారు. పసికందు బంధువులు జహీరాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్ లో అస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణం గా పసికందు మృతి చెందినట్లు ఫిర్యాదు చేశారు.

Advertisement

Also read: Fertilizer App: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. యూరియా బుకింగ్‌లో సంచలనం!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×