E-Paper
Advertisement

విద్యార్థులకు ఎన్డీఏ బిగ్ అలర్ట్.. రేపే పరీక్ష.. జామర్లు సీసీ కెమెరాల ముందే పరీక్ష..!

విద్యార్థులకు ఎన్డీఏ బిగ్ అలర్ట్.. రేపే పరీక్ష.. జామర్లు సీసీ కెమెరాల ముందే పరీక్ష..!
Advertisement

NEET 2026: స్వేచ్ఛ బ్యూరో: దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ -2026 మే 3న (ఆదివారం) జరగనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఎన్టీఏ సమన్వయంతో పరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేసింది. గతేడదితో పోలిస్తే ఈసారి అభ్యర్థుల సంఖ్యతో పాటు పరీక్షా కేంద్రాల సంఖ్య కూడా పెరిగింది.ఈ ఏడాది తెలంగాణ నుంచి మొత్తం 73,084 మంది విద్యార్థులు నీట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. గతేడాది (2025) ఈ సంఖ్య 72,507గా ఉండేది. అభ్యర్థుల సౌకర్యార్థం రాష్ట్రవ్యాప్తంగా 24 జిల్లాల్లో 199 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. గతేడాది 190 కేంద్రాల్లో పరీక్ష జరగ్గా, ఈసారి అదనంగా మరో 9 కేంద్రాలను పెంచారు.

సమన్వయ కమిటీలు..

ఈ కేంద్రాలన్నీ కేవలం ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే (మెడికల్ కాలేజీలు మినహా) ఏర్పాటు చేయడం గమనార్హం.పరీక్షను అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో సమన్వయ కమిటీలను నియమించింది. డీఎంఈ డాక్టర్ ఏ. నరేంద్ర కుమార్ నోడల్ ఆఫీసర్‌గా, అదనపు డీజీపీ మహేష్ ఎం. భగవత్ పోలీస్ ప్రతినిధిగా, ఎన్టీఏ తరపున డాక్టర్ వృందేశ్వరి పవార్ పర్యవేక్షిస్తున్నారు.జిల్లా కలెక్టర్లు ఛైర్మన్లుగా, సీపీ, ఎస్పీలు పోలీస్ ప్రతినిధులుగా వ్యవహరిస్తూ ఏర్పాట్లను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రభుత్వం కఠిన ఆదేశాలు జారీ చేసింది. ప్రతి ఐదు కేంద్రాలకు ఒక సివిల్ నోడల్ ఆఫీసర్, ప్రతి కేంద్రం వద్ద ఒక పోలీస్ నోడల్ ఆఫీసర్‌ను నియమించారు. కేంద్రాల వద్ద డ్యూయల్ లేయర్ ఫ్రిస్కింగ్ (తనిఖీలు) ఉంటుంది.

Advertisement

Also read: ఆలయాలకే రక్షణ కరువైందా? అల్లూరి జిల్లాలోని పాడేరు దుర్గాదేవి ఆలయంలో భారీ చోరీ

తల్లిదండ్రుల కోసం.. 

అన్ని కేంద్రాల్లో సీసీటీవీ సర్వైలెన్స్, బయోమెట్రిక్ వెరిఫికేషన్, జామర్లను ఏర్పాటు చేశారు. ఇక ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అభ్యర్థుల కోసం తాగునీరు, ఓఆర్ఎస్ తో కూడిన మెడికల్ క్యాంపులు, అంబులెన్స్ సదుపాయం కల్పించారు. విద్యార్థులతో వచ్చే తల్లిదండ్రుల కోసం ప్రత్యేక వెయిటింగ్ ఏరియాలను ఏర్పాటు చేశారు.

ఎన్టీఏ నిబంధనల ప్రకారం..

Advertisement

ప్రశ్నాపత్రాల రవాణా, స్టోరేజ్ అంతా పోలీస్ రక్షణలో, సీసీ కెమెరాల నిఘాలో జరుగుతుందని అధికారులు వెల్లడించారు. ఎన్టీఏ నిబంధనల ప్రకారం విద్యార్థులు నిర్ణీత సమయానికి ముందే కేంద్రాలకు చేరుకోవాలని, ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను లోపలికి అనుమతించబోమని స్పష్టం చేశారు. ఏవైనా సమస్యలు తలెత్తితే తక్షణమే ఎన్టీఏకు నివేదించేలా జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లను కూడా ఏర్పాటు చేశారు.

Also Read: చెల్లె రాజ‌కీయ వ్యూహం ముందు కేటీఆర్ బోల్తా..! టీఆరెస్ పేరు కోసం క‌విత రాజకీయ చాణ‌క్యం..

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×