E-Paper
Advertisement

Rice Mill Scam: రూ. 43 కోట్లు పక్కదారి పట్టించిన మిల్లర్లు.. ఎస్పీ యాక్షన్ ప్లాన్‌ మామూలుగా లేదుగా!

Rice Mill Scam: రూ. 43 కోట్లు పక్కదారి పట్టించిన మిల్లర్లు.. ఎస్పీ యాక్షన్ ప్లాన్‌ మామూలుగా లేదుగా!
Advertisement

Rice Mill Scam: నల్లగొండ జిల్లాలో సంచలనం సృష్టించిన భారీ ధాన్యం కుంభకోణం కేసులో విచారణ వేగవంతమైంది. 2022-23 యాసంగి సీజన్‌కు సంబంధించి ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి, ధాన్యాన్ని పక్కదారి పట్టించిన ఇద్దరు నిందితులను నల్లగొండ పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ నేతృత్వంలో పోలీసులు ఈ అక్రమాలపై లోతైన దర్యాప్తు చేపట్టి, కీలక నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

2022-23 యాసంగి కాలంలో జిల్లాలోని ఏడు రైస్ మిల్లులకు ప్రభుత్వం సుమారు 7.40 లక్షల క్వింటాళ్ల ధాన్యాన్ని మిల్లింగ్ (CMR) కోసం కేటాయించింది. అయితే.. మిల్లర్లు ఆ ధాన్యాన్ని మిల్లింగ్ చేసి తిరిగి ప్రభుత్వానికి అప్పగించాల్సింది పోయి, బహిరంగ మార్కెట్లో అమ్ముకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. సివిల్ సప్లైస్ విజిలెన్స్ విభాగం నిర్వహించిన తనిఖీల్లో ఈ భారీ అక్రమం వెలుగులోకి వచ్చింది. మిల్లుల్లో ఉండాల్సిన ధాన్యానికి, రికార్డులకు పొంతన లేకపోవడంతో అధికారులు షాక్‌కు గురయ్యారు.

Advertisement

ప్రాథమిక అంచనాల ప్రకారం.. ఈ ఏడు మిల్లుల ద్వారా సుమారు రూ. 42.80 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు నిర్ధారించారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని ప్రభుత్వానికి ఇవ్వకుండా మిల్లర్లు వ్యక్తిగత లాభాల కోసం మళ్లించారు. ఈ వ్యవహారంపై ఫిర్యాదులు అందడంతో, ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రత్యేక బృందాలతో విచారణను వేగవంతం చేశారు.

Also Read: వార్నీ.. ఆ గేదె పాలు తాగిన 30 మందికి రేబీస్ భయం! జగిత్యాల జిల్లాలో ఏం జరిగిందంటే?

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×