E-Paper
Advertisement

Hyderabad News: గోషామహల్‌లో మళ్లీ కుంగిన నాలా రోడ్డు, పలు వాహనాలు డ్యామేజ్

Hyderabad News: గోషామహల్‌లో మళ్లీ కుంగిన నాలా రోడ్డు, పలు వాహనాలు డ్యామేజ్
Advertisement

Hyderabad News: హైదరాబాద్ గోషామహల్ ప్రాంతంలో నాలా రోడ్డు మరోసారి కుంగింది. చాక్నవాడి దగ్గర ప్రధాన రహదారిపై ఈ ఘటన జరిగింది. అదే సమయంలో ఆ రూట్లో వెళ్లున్న పలు వాహనాలు నాలాలో ఇరుక్కుపోయాయి. వాటిలో కారు, ఆటో, ట్రాక్టర్ ఉన్నాయి.

ఇప్పటికే నాలుగు సార్లు కుంగింది నాలా రోడ్డు. ప్రధాన రోడ్డు కావడంతో ట్రాఫిక్ జామ్‌తో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో ప్రజలు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. పలుమార్లు నాలా రోడ్డు కుంగుతుందని స్థానికులు మొరపెట్టుకున్న జిహెచ్ఎంసి అధికారులు పట్టించుకోవడం లేదు.

Advertisement

నాలాకు సంబంధించిన రోడ్డును పూర్తిస్థాయిలో విచారణ చేసి, పటిష్టంగా నిర్మించాలని కోరుతున్నారు. అధికారులు తాత్కాలిక మరమ్మత్తులు చేయించడం వల్ల ఈ ప్రమాదం చోటుచేసుకుందని స్థానికులు వ్యక్తం చేస్తున్నారు.

కుంగిన రోడ్డు గురించి సమాచారం అందుకున్న వెంటనే మేయర్ విజయలక్ష్మి అక్కడికి చేరుకున్నారు. జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతితో కలిసి  ఘటన జరిగిన తీరు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ నాలా ఏ ప్రాంతం నుంచి వస్తుందని,  ఎటు వైపు వెళ్తోందంటూ ఆరా తీశారు. గోషామహల్ నుంచి దారుస్సలాం వెళ్లే ప్రధాన రహదారుల్లో ఇది కూడా ఒకటి.

Advertisement

ALSO READ: సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా జాన్ వెస్లీ ఎన్నిక.. మొదటిసారి దళిత వర్గ నేతకు అవకాశం..

ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వెంటనే ఒకరోజు టెండర్లు పిలిచి పనులు పూర్తి చేయాలని అధికారులను మేయర్ ఆదేశించారు. తరచూ జరుగుతున్న ఘటనపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు మేయర్ విజయలక్ష్మి. అధిక లోడుతో వచ్చే వాహనాలను నాలా రోడ్డుపై అనుమతించవద్దని మేయర్‌ను వ్యాపారులు కోరారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×