E-Paper
Advertisement

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?
Advertisement

Dindi Diversion: స్వేచ్చ బ్యూరో: కల్వకుర్తి మరియు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా పూర్తి ఆయకట్టుకు నీరు అందించేందుకు డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ మరియు పిల్ల కాలువలు ప్రధాన కాలువలు పంట కాలువలు నిర్మించేందుకు భూ సేకరణను వేగవంతంగా పూర్తి చేసి భూ నిర్వాసితులకు పరిహారం అందించాలని డిండి ప్రాజెక్టుకు ఏదుల నుండి నీటిని తరలిస్తే మరో ఉద్యమం తప్పదని మాజీ మంత్రి డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి హెచ్చరించారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఆయన మాట్లాడుతూ…* సున్నపురాళ్ల తండా నుండి కుడికిళ్ల వరకు మూడున్నర కిలోమీటర్ల పనులను రెండున్నర సంవత్సరాలు అయినా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయలేదని మండిపడ్డారు.

మంత్రి జూపల్లి కారణం..

ఈ ప్రాంతంలో పనులు పూర్తి చేస్తే రిజర్వాయర్లను నింపుకునే అవకాశం ఉండేదని అన్నారు. నార్లాపూర్ సమగ్రంలో మహాత్మా గాంధీ ఎత్తిపోతల పథకం పనుల సమీపంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను చేపట్టడం ద్వారా అనేక నష్టం వాటిల్లిందని అన్నారు. ప్రాజెక్టుల నతనడకకు మంత్రి జూపల్లి కారణమని వెంటనే ముఖ్యమంత్రి పర్యటనలు ప్రాజెక్టును పూర్తి చేసి ఐదు మోటర్ల ద్వారా నీటిని సరఫరా చేసే విధంగా ఒప్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 34 లక్షల ఆయకట్టు ఉండగా తొమ్మిది లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతుందని అన్నారు.

Advertisement

Also Read: రైతులకు జూన్ 2 కానుక మిస్!: పనులన్నీ పూర్తి చేసినా సాంకేతిక అడ్డంకులు!

నల్గొండ జిల్లాలో..

సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి నియోజకవర్గానికి జిల్లాకే మంత్రిగా పనిచేస్తున్నారే తప్ప రాష్ట్రానికి చేస్తున్నట్లు లేదని నల్గొండ జిల్లాలో 17 లక్షల ఆయకట్టు ఉండగా ఇప్పటికే 14 లక్షల 50 వేల ఎకరాలకు నీరు అందుతుందని ఎస్ఎల్ బీసీ టర్నల్ ద్వారా మరికొంత ఆయకట్టుకు నీరు అందించవచ్చని కానీ ఏదుల రిజర్వాయర్ ద్వారా దిండికి నీటికి తరలించుటకు వెళ్లేందుకు పనులు ప్రారంభిస్తున్న జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేలు నోరు తిరగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరో ఉద్యమం..

Advertisement

ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తే మరో ఉద్యమం చేపడతామని ఆయన హెచ్చరించారు. కేఎల్ఐ, పాలమూరు ఎత్తిపోతల పథకం ఎప్పటిలోగా పూర్తి చేస్తారో స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్ల కమిషన్ల కోసం పనులు చేస్తే సహించేది లేదని ప్రాజెక్టును నిర్మాణంలో తమ కుటుంబం పొలాలు కూడా కోల్పోవలసి వచ్చిందని అయినప్పటికీ ప్రాజెక్టుల కోసం త్యాగం చేశామని అన్నారు.

Also Read: రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×