E-Paper
Advertisement

Medchal News: మహిళా సాధికారతతోనే సమాజ అభివృద్ధి సాధ్యం : కౌన్సిలర్ నిశిత రెడ్డి

Medchal News: మహిళా సాధికారతతోనే సమాజ అభివృద్ధి సాధ్యం  : కౌన్సిలర్ నిశిత రెడ్డి
Advertisement

Medchal News: స్వేచ్ఛ, బ్యూరో:   ఎల్లంపేట్ మున్సిపల్ పరిధిలోని మైసిరెడ్డిపల్లి గ్రామంలో మహిళా సాధికారతపై  అవగాహన సదస్సు నిర్వహించారు. 22వ వార్డు కౌన్సిలర్ నిశిత రెడ్డి ఆధ్వర్యంలో, లయోలా కళాశాల సహకారంతో జరిగిన ఈ కార్యక్రమం గ్రామ మహిళల్లో చైతన్యం నింపింది.

మహిళల సాధికారతే సమాజ అభివృద్ధికి మూలస్తంభం 

ఈ సందర్భంగా కౌన్సిలర్ నిశిత రెడ్డి మాట్లాడుతూ మహిళల సాధికారతే సమాజ అభివృద్ధికి మూలస్తంభమని పేర్కొన్నారు. గ్రామీణ మహిళలు ఆర్థికంగా స్వావలంబులు కావాలంటే స్వయం సహాయక సంఘాల బలోపేతం అత్యవసరమని స్పష్టం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను సమర్థవంతంగా వినియోగించుకుంటే కుటుంబ ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కరుణాకర్, బాబు రావు, స్టీఫెన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Also Read: Theertham: గుడిలో తీర్థము తీసుకున్నప్పుడు ఈ తప్పులు అసలు చేయకండి – ఇంకా గుడిలో ఎలా ఉండాలంటే 

ఈటల రాజేందర్‌ను కలిసిన  వైస్ చైర్‌పర్సన్

స్వేచ్ఛ, బ్యూరో: మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ ని ఎల్లంపేట మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ మేకల రజిత దేవేందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం షామీర్‌పేటలోని ఆయన నివాసానికి వెళ్లిన ఆమె పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సత్కరించారు.ఈ సందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్ ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. మున్సిపాలిటీ ప్రజలు నమ్మకంతో గెలిపించారని, ఆ విశ్వాసాన్ని నిలబెట్టేలా కృషి చేయాలని సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారమే ప్రాధాన్యంగా ఉండాలని, అభివృద్ధి పనులకు అవసరమైన నిధుల కోసం కేంద్ర, రాష్ట్ర స్థాయిలో తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ అధ్యక్షుడు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Also Read: Harish Rao: సీఎం రేవంత్ రెడ్డి విలాసాలపై హరీష్ రావు సెటైర్లు!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×