E-Paper
Advertisement

Election Polling : మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ ప్రారంభం.. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్

Election Polling : మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ ప్రారంభం.. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్
Advertisement

Election Polling : మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు భారీగా చేరుకుంటున్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. ఆ సమయం వరకు పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్లలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. మనుగోడులో మొత్తం 2,41,855 మంది ఓటర్లు ఉన్నారు. నియోజకవర్గంలో అనారోగ్య కారణాలతో కదలలేని స్థితిలో ఉన్న 739 మంది వృద్ధులు పోస్టల్‌ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే 696 మంది ఇంటి నుంచే ఓటు వేసే హక్కును వినియోగించుకున్నారు. మిగిలిన 43 మంది అందుబాటులో లేరు. వీరు పోలింగ్‌ కేంద్రాల్లో ఓటు వేయాలనుకున్నా అవకాశం లేదని ఎన్నికల అధికారులు తెలిపారు. ఉపఎన్నిక బరిలో 47 మంది అభ్యర్థులు ఉన్నారు. మొత్తం 119 కేంద్రాల్లోని 298 బూత్ ల్లో పోలింగ్ జరుగుతోంది. నవంబర్ 6న ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు చేపడతారు.

ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలింగ్‌ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. అన్ని బూత్‌లలో వెబ్‌ క్యాస్టింగ్‌ చేస్తున్నారు. 2 వేల మంది పోలీసులతోపాటు కేంద్ర సాయుధ పోలీసులు, సీఆర్‌పీఎఫ్, సీఐఎస్‌ఎఫ్, ఆర్‌ఏఎఫ్‌ లాంటి 6 కంపెనీల బలగాలను మోహరించారు. మొబైల్‌ స్ట్రయికింగ్‌ ఫోర్స్, స్పెషల్‌ స్ట్రయికింగ్‌ ఫోర్స్, ప్రత్యేక నిఘా బృందాలు, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు విధుల్లో ఉన్నాయి. పోలింగ్‌ కేంద్రాల వద్ద బందోబస్తును, పోలింగ్‌ సరళిని రాచకొండ పోలీసు కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ నుంచి పర్యవేక్షిస్తున్నారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×