E-Paper
Advertisement

సీఎం రేవంత్, కేసీఆర్.. ఇద్దిరికీ లాగుల మీదే ప్రేమ, ఎంపీ అర్వింద్ సెటైర్లు మామూలుగా లేవుగా..!

సీఎం రేవంత్, కేసీఆర్.. ఇద్దిరికీ లాగుల మీదే ప్రేమ, ఎంపీ అర్వింద్ సెటైర్లు మామూలుగా లేవుగా..!
Advertisement

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ రాజకీయ ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధించారు. తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య సాగుతున్న మాటల యుద్ధంపై ఆయన తనదైన శైలిలో స్పందించారు. రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఇద్దరూ లాగుల గురించే మాట్లాడుతున్నారని.. వారిద్దరికీ వాటిపైనే ఎక్కువ ప్రేమ ఉన్నట్లు కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రైతులు పడుతున్న ఇబ్బందులపై ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడ్డారు. ముఖ్యంగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోయి అన్నదాతలు ఆవేదన చెందుతున్నారని ఆరోపించారు.

రైతు సంక్షేమం గురించి మాట్లాడుతూ పసుపు రైతులకు కీలక హామీ ఇచ్చారు. తాను రాజకీయాల నుండి తప్పుకునే లోపు పసుపు పంటకు క్వింటాల్‌కు రూ.30 వేల మద్దతు ధర కల్పించి తీరుతానని ధీమా వ్యక్తం చేశారు. గతంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న క్రమంలోనే పసుపు బోర్డు సాధించామని గుర్తు చేశారు. రైతు ప్రయోజనాల కోసం తన పోరాటం నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేశారు. జగిత్యాల సభలో కేసీఆర్ చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలని కొట్టిపారేశారు.

Advertisement

ట్రంప్, కేసీఆర్ ఇద్దరూ ఉండాలే..

కేసీఆర్ వ్యక్తిగత అంశాలపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ స్థాయిలో డొనాల్డ్ ట్రంప్, రాష్ట్రంలో కేసీఆర్ ఉంటేనే వినోదం ఉంటుందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని తాము కోరుకుంటున్నామని.. అయితే ఆయన తన కళ్ళతోనే బీఆర్ఎస్ పార్టీ అంతం కావడం చూడాలన్నదే తన ఆకాంక్ష అని తెలిపారు. ఆ సమయం త్వరలోనే రాబోతుందని జోస్యం చెప్పారు. కేసీఆర్‌ను ఆయన బిడ్డ కవిత, కుమారుడు కేటీఆర్ ఎక్కువగా హింసిస్తున్నారని ఆరోపించారు. వారిద్దరికీ ఫ్లైట్ టికెట్లు ఇచ్చి అమెరికా పంపిస్తే కేసీఆర్ దరిద్రంతో పాటు తెలంగాణ దరిద్రం వదులుతుందని తీవ్రస్థాయిలో విమర్శించారు.

Advertisement

కేసీఆర్ గ్లామర్ గురించి ప్రస్తావిస్తూ ఆయన తెలంగాణ కోసం కొట్లాడాల్సిన అవసరం లేదని.. కేవలం విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అస్తవ్యస్తంగా మారిందని.. రైతుల గోడు పట్టించుకునే నాథుడే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఉనికి కోల్పోతోందని విమర్శించారు. రైతుల పక్షాన బీజేపీ పోరాటం కొనసాగిస్తుందని అర్వింద్ స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

ALSO READ: కాళేశ్వరం నిధులతో కూతురి పెళ్లి.. చిక్కుల్లో రిటైర్డ్ ఐఏఎస్.. కేంద్రానికి దిల్లీ హైకోర్టు నోటీసులు!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×