E-Paper
Advertisement

Telangana Politics: కేటీఆర్‌కు ఎంపీ చామల కౌంటర్.. బీఆర్‌ఎస్ చచ్చిన శవం అంటూ..

Telangana Politics:  కేటీఆర్‌కు ఎంపీ చామల కౌంటర్.. బీఆర్‌ఎస్ చచ్చిన శవం అంటూ..
Advertisement

Telangana Politics: తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధం ముదురుతోంది. కాంగ్రెస్ – బీఆర్ఎస్ నేతల మధ్య మాటల వేడి తీవ్రమైంది. ఏదో విధంగా నిత్యం వార్తల్లో ఉండేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది బీఆర్ఎస్. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి టార్గెట్ మాటల అస్త్రాలను సంధిస్తోంది. కొన్నాళ్లుగా బీఆర్ఎస్‌లో అదే జరుగుతోంది.

కేటీఆర్‌కు ఎంపీ చామల కౌంటర్

Advertisement

బుధవారం కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో రియాక్ట్ అయ్యారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఈ నేపథ్యంలో ఎక్స్ వేదికగా ఆయన రిప్లై ఇచ్చారు. రోడ్డెక్కమంటూ పార్టీ లీడర్లను కేటీఆర్ బతిమిలాడుకుంటున్నారని ఆరోపించారు. ఉద్యమ పార్టీగా చెప్పుకునే బీఆర్ఎస్ ఈ స్థాయికి పడిపోవడం దారుణమనేది ఆయన మాట.

బీఆర్‌ఎస్ చచ్చిన శవమని, ఎంత లేపినా లేవదనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. పార్టీ అధినేత కేసీఆర్ ఫామ్‌హౌస్‌కి పరిమితమయ్యారని, కేటీఆర్ సోషల్ మీడియాలో ఉంటారని దుయ్యబట్టారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో కల్వకుర్తి నియోజకవర్గానికి కార్యకర్తలు బీఆర్ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. ఆ సందర్భంగా కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Advertisement

బీఆర్‌ఎస్ చచ్చిన శవం అంటూ ఆగ్రహం

కాంగ్రెస్ పార్టీ రెండున్నరేళ్లలో అన్నివర్గాల ప్రజలను మోసపోయారని, గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు చనిపోయినా ప్రభుత్వానికి ఏ మాత్రం చలనం లేదన్నారు. కేవలం పైశాచిక ఆనందం గురించి మాట్లాడడం సిగ్గుచేటని, విద్యార్థులు, రైతులు, సామాన్య ప్రజల ఇబ్బందులు ముఖ్యమంత్రికి వినోదంగా కనిపిస్తున్నాయా అంటూ ప్రశ్నించిన విషయం తెల్సిందే.

ALSO READ: తెలంగాణ SSC ఫలితాల్లో భాష్యం ‘బంపర్’ విక్టరీ.. విజయకేతనం ఎగురవేసిన విద్యార్థులు!

 

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×