E-Paper
Advertisement

మామ తర్వాత సీఎం కావాలనుకున్నారు.. కానీ ప్రజలు కల చెరిపేశారు.. హరీష్ తీరుపై చామల ఎద్దేవా!

మామ తర్వాత సీఎం కావాలనుకున్నారు.. కానీ ప్రజలు కల చెరిపేశారు.. హరీష్ తీరుపై చామల ఎద్దేవా!
Advertisement

MP Chamala: భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావు మధ్య సాగుతున్న మాటల యుద్ధం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై హరీష్ రావు చేస్తున్న విమర్శలను చామల తీవ్రంగా తిప్పికొట్టారు. రాజకీయాల్లో విమర్శలు సహజమే కానీ, హరీష్ రావు వ్యాఖ్యలు కేవలం అసూయతో కూడుకున్నవని ఆయన మండిపడ్డారు.

కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ ఆహ్వానం మేరకు సీఎం రేవంత్ రెడ్డి బ్రేక్ ఫాస్ట్ మీటింగ్‌కు వెళ్లడాన్ని హరీష్ రావు తప్పుబట్టడంపై చామల ఘాటుగా స్పందించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం, ముఖ్యంగా బయ్యారంలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు వంటి కీలక అంశాలపై చర్చించేందుకే సీఎం అక్కడికి వెళ్లారని ఆయన స్పష్టం చేశారు. ‘గతంలో మీరు వేరే పార్టీ నేతల ఇళ్లకు వెళ్లలేదా?’ అని ప్రశ్నిస్తూ హరీష్ రావు ద్వంద్వ నీతిని ఎండగట్టారు. హరీష్ రావుకు తన మామ తర్వాత తానే సీఎం కావాలనే ఆశ ఉండేదని, కానీ అధికారం పోవడంతో ఆ కలను తెలంగాణ ప్రజలు చెరిపేశారని చామల ఎద్దేవా చేశారు.

Advertisement

ఇక హరీష్ రావు వాడిన ‘హైబ్రిడ్, క్రాస్ బ్రీడ్’ వంటి పదాలపై చామల మరింత సీరియస్ అయ్యారు. అసలైన క్రాస్ బ్రీడ్ రాజకీయం చేసింది బీఆర్ఎస్సేనని, కాంగ్రెస్‌ను దెబ్బతీయడం కోసం తన ఓట్లను బీజేపీకి ధారాదత్తం చేసి 8 మంది బీజేపీ ఎంపీల గెలుపుకు బీఆర్ఎస్ సహకరించిందని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధి కంటే కేవలం కాంగ్రెస్‌ను బద్నాం చేయడమే లక్ష్యంగా హరీష్ రావు రోజుకో మాట మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అటు పార్లమెంట్‌లోనూ తెలంగాణ ఆత్మగౌరవం కోసం తాము పోరాడుతున్నామని చామల గుర్తుచేశారు. తేజస్వి సూర్య తెలంగాణపై చేసిన అనుచిత వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్‌ను కలిసి ఫిర్యాదు చేశామని, మకర్ ద్వార్ వద్ద ఆందోళన కూడా చేపట్టామని చెప్పారు. కేసీఆర్ ఫామ్‌హౌస్‌కే పరిమితం కావాలని, రేవంత్ రెడ్డి పాలన కొనసాగాలని ప్రజలు కోరుకుంటున్నారని, హరీష్ రావు ఇకనైనా తన పాత చరిత్రను గుర్తు తెచ్చుకుంటే మంచిదని హితవు పలికారు.

Advertisement

Also Read: అనకాపల్లి స్టేషన్‌లో కుప్పకూలిన బ్రిడ్జి.. రైల్వే ట్రాక్ క్లోజ్!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×