// // MP Chamala Fire: జగదీష్ రెడ్డి గుంటకండ్ల కాదు.. గుంటనక్క కళ్లు..! -->
E-Paper
Advertisement

జగదీష్ రెడ్డి గుంటకండ్ల కాదు.. గుంటనక్క కళ్లు.. ఎంపీ చామల ఫైర్!

జగదీష్ రెడ్డి గుంటకండ్ల కాదు.. గుంటనక్క కళ్లు.. ఎంపీ చామల ఫైర్!
Advertisement

MP Chamala Fire: మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి ఎంపి చామల కిరణ్ కమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనడం లేదని జగదీష్ రెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. జగదీష్ రెడ్డి ఇంటి పేరు గుంటకండ్ల కానీ గుంట నక్క కండ్లతో జగదీష్ రెడ్డికి ధాన్యం కొనుగోళ్లు కనపడటం లేదా అని విమర్షించారు. బిఆర్ఎస్ హయాంలో 2021-22 లో 6,609 కొనుగోలు కేంద్రాలు పెట్టారు. 2022-23 లో 7037 కొనుగోలు కేంద్రాలు పెట్టారు. 117.23 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోల్లు మాత్రమే బీఆర్ఎస్ హయాంలో చేశారని అన్నారు. కాంగ్రెస్ హయాంలో 2023-24 లో 7,178 కొనుగోలు కేంద్రాలు పెట్టామని, 2024-25 లో కాంగ్రెస్ ప్రభుత్వం 8,378 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందని తెలిపారు. 2025-26 లో 8,575 కొనుగోలు కేంద్రాలు పెట్టారు. ఎవరి హయాంలో కొనుగోలు సెంటర్లు పెరిగాయో జగదీష్ రెడ్డి తెలుసుకోవాలని గాటుగా విమర్షిచారు.

ఈ సంవత్సరం ఇప్పటికే..

బిఆర్ఎస్ హయాంలో 2021 నుంచి 2023 వరకు 23,599.36 కోట్ల రూపాయలను రైతులకు ఇచ్చారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రెండు ఏళ్ళలోనే 27,747.75 కోట్ల రూపాయలను రైతులకు ఇచ్చిందని అన్నారు. ఈ సంవత్సరం ఇప్పటికే 6,500 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశామరని అన్నారు. ఈ లెక్కలన్నీ ప్రజలకు తెలియదని అనుకుంటున్నారా..? కళ్ళు లేని కబోదుల్లా బిఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని ఎంపీ చామాల ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ప్రజలు చెప్పుతో కొట్టి మీ నాయకుడిని ఫామ్ హౌస్ కు పంపించారు జగదీష్ రెడ్డి అని అన్నారు. బిఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకుల బ్రీడ్ ఏంటి, మీ నాయకుడు కేసీఆర్ బ్రీడ్ ఏంటి..? జగదీష్ రెడ్డి అంటూ ఫైర్ అయ్యారు.

Advertisement

Also read: సర్కారు భూములకు ఫుల్ డిమాండ్.. ఓక్కరోజులోనే రూ.83 కోట్ల ఆదాయం!

మీ బాస్‌ది ఎ బ్రీడో తెలీదా..

కేసీఆర్ ది టీడీపీ బ్రీడ్ కాదా? మంత్రి పదవి ఇవ్వకపోతే పార్టీ పెట్టారు. తెలంగాణ ప్రజలను కేసీఆర్ మోసం చేశారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదని, బిఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావు, మల్లారెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, సుధీర్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి వాళ్ళు జగదీష్ రెడ్డికి చెప్పాలని అన్నారు. నోరు ఉందని ఇష్టం వచ్చినట్లు మాట్లావద్దు అని జగదీష్ రెడ్డి పై ఎంపీ చామల గాటు వ్యాఖ్యలు చేశారు. నల్గొండ జిల్లాలో మోసపూరిత రాజకీయాలకు జగదీష్ రెడ్డి కేరాఫ్ అని అన్నారు. వందేళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీపై మాట్లాడే హక్కు జగదీష్ రెడ్డికి లేదని, సూర్యాపేటలో త్రిముఖ పోటీలో 2,000 వేల ఓట్లతో జగదీష్ రెడ్డి గెలిచారని గుర్తు చేశారు.

Advertisement

Also Read: గ్రామీణ మహిళలకు లైఫ్ సెట్ అయ్యే సూపర్ ఛాన్స్.. ప్రతి నెల 7 లక్షలు లాభం..!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×