// // MP Arvind on Kavitha: పాత మేడమే.. కొత్త పార్టీ, కొత్త సబ్జెక్ట్ అంటూ ఎంపీ అరవింద్ వ్యాఖ్యలు -->
E-Paper
Advertisement

MP Arvind on Kavitha: పాత మేడమే.. కొత్త పార్టీ, కొత్త సబ్జెక్ట్ అంటూ ఎంపీ అరవింద్ వ్యాఖ్యలు

MP Arvind on Kavitha: పాత మేడమే.. కొత్త పార్టీ, కొత్త సబ్జెక్ట్ అంటూ ఎంపీ అరవింద్ వ్యాఖ్యలు
Advertisement

MP Arvind on Kavitha: రానున్న ఎన్నికల్లో బీజేపీ-బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయన్న ప్రచారాన్ని ఖండించారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఉండదని తేల్చేశారు. లీడర్, క్యాడర్ లేని పార్టీ బీఆర్ఎస్ అని ఘాటుగా విమర్శించారు. అవినీతి, అహంకారంతో కూడిన పార్టీతో మాకేంటి పొత్తు విమర్శలు చేశారు.

తెలంగాణ జాగృతి చీఫ్ కవితపై ఎంపీ అరవింద్ సెటైర్లు

Advertisement

ఆదివారం ఉదయం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన వంటి అంశాలపై మాట్లాడారు. ఇదే సందర్బంలో తెలంగాణ రాజకీయాల గురించి నోరు విప్పారు. ఎక్కడెక్కడివారు బీసీల గురించి మాటలు చెబుతున్నారని అన్నారు. కొత్త పార్టీ వస్తుందని ఆమె కూడా బీసీల గురించి మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు.

పాత మేడమే కొత్త పార్టీ, కొత్త సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.  బీసీల గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్ పార్టీకి ముమ్మాటికీ లేదన్నారు. తనకు ఎంపీ లక్ష్మణ్‌కు ఎలాంటి గ్యాప్ లేదన్నారు. గడిచిన తొమ్మిదేళ్లుగా తాను చిట్‌చాట్ చేయలేదన్నారు. తాను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే అనుకూల పనులు చేసేదెవరని ప్రశ్నించారు.

Advertisement

పాత మేడం.. కొత్త పార్టీ, కొత్త సబ్జెక్ట్ అంటూ కామెంట్స్

కవిత పార్టీకి సీఎం రేవంత్ రెడ్డి ఫండింగ్ ఇస్తున్నారని మరొక ఆరోపణ చేశారు ఎంపీ అరవింద్. కులాల వారీగా హిందువులను విడదీసేందుకు ముఖ్యమంత్రి చేయిస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్-కాంగ్రెస్ దొంగ పొత్తులతో మా పార్టీని దెబ్బ తీయడానికి ప్రణాళికలు రచిస్తున్నారని చెప్పుకొచ్చారు.

ఇప్పుటి వరకు కేటీఆర్‍ను ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి భారీగా వలసలు ఉండబోతున్నాయన్నారు. ఎవరిని పార్టీలోకి తీసుకోవాలి అనే విషయంలో పార్టీ పెద్దలు నిర్ణయం తీసుకుంటారన్నారు. కేటీఆర్-రేవంత్ రెడ్డి ఒక్కటేనని, బీజేపీని దెబ్బతీసేందుకు కలిసి డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు.

ALSO READ: తెలంగాణలో ఇంటర్‌ ఫలితాలు విడుదల, ఈసారి బాలికలే టాప్ 

కేసీఆర్‍కు పదేళ్లు సీఎంగా అవకాశం ఇస్తే కనీసం సచివాలయానికి రాలేదని, ప్రతిపక్ష నాయకుడిగా అవకాశం ఇస్తే ఇప్పటివరకు అసెంబ్లీలో అడుగుపెట్టలేదన్నారు. కేసీఆర్ తన పదేళ్ల పాలనలో ఏం చేశారో ఆయన కూతురు కవిత స్వయంగా చెబుతున్నారని గుర్తు చేశారు.

 

Tags

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×