E-Paper
Advertisement

MLC Kavitha : ఎంపీ అరవింద్ కు కవిత సీరియస్ వార్నింగ్.. గీత దాటితే అంతే సంగతులు

MLC Kavitha : ఎంపీ అరవింద్ కు కవిత సీరియస్ వార్నింగ్.. గీత దాటితే అంతే సంగతులు
Advertisement

MLC Kavitha : బీజేపీ ఎంపీ అరవింద్‌పై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ అరవింద్‌ తనపై చేసిన ఆరోపణలను ఖండించారు. అరవింద్‌ అనుకోకుండా గెలిచారని విమర్శించారు. అరవింద్‌ చిల్లరగా మాట్లాడతారని మండిపడ్డారు. నిజామాబాద్‌ పేరును బీజేపీ ఎంపీ చెడగొడుతున్నారని విమర్శించారు. బురదలో రాయి వేయకూడదనే ఇన్నాళ్లూ అరవింద్‌ను పట్టించుకోలేదన్నారు. తన గురించి తప్పుగా మాట్లాడితే చెప్పుతో కొడతానని హెచ్చరించారు. రాజకీయం చేయి.. పిచ్చి వేషాలు వేయకు అరవింద్‌ అంటూ కవిత ఘాటుగా అన్నారు. పార్టీ మారతానని అడ్డమైన కూతలు కూస్తే నిజామాబాద్‌ చౌరస్తాలో నిలబెట్టి చెప్పుతో కొడతానని అన్నారు. తాను ఆవేదనతో, బాధతో మాట్లాడుతున్నానని తెలిపారు. ఇంకోసారి గీత దాటితే ఊరుకోనని హెచ్చరించారు.

రాజకీయాల్లో ఉంటే నీతి, నిజాయితీ, ఇంగిత జ్ఞానం ఉండాలన్నారు కవిత. కుక్క కాటుకు చెప్పుదెబ్బ తప్పదన్నారు. తాను మల్లికార్జున ఖర్గేతో మాట్లాడి కాంగ్రెస్‌లో చేరతానని అన్నానా? అని ప్రశ్నించారు. అరవింద్‌ ఎక్కడ పోటీ చేసినా వెంటాడి ఓడిస్తానని సవాల్ చేశారు. కాంగ్రెస్‌తో కలిసి గెలిచింది అరవిందే అని ఆరోపించారు.

Advertisement

పార్లమెంట్‌లో ఎంపీ అరవింద్‌ చేసిందేమీ లేదని కవిత అన్నారు. బీజేపీలో చేరమని తనకు ప్రతిపాదనలు వచ్చాయని తెలిపారు. కాషాయ నేతలు చాలా ఆశలు చూపించారని వెల్లడించారు. బీజేపీ చేసిన ఆఫర్ ను తాను తిరస్కరించానని కవిత చెప్పుకొచ్చారు. ఏక్ నాథ్ షిండే తరహాలో ఈ ప్రతిపాదన తెచ్చారని వివరించారు. వారి ప్రతిపాదనను మర్యాదకపూర్వకంగా తిరస్కరించానని తెలిపారు. ప్రజలను, నాయకులను మోసం చేయబోమని స్పష్టం చేశారు. తనకు ఈడీ నుంచి ఎలాంటి నోటీసులు రాలేదన్నారు. ఎలాంటి కేసులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×