// //
MLC Kavitha Bail Petition Verdict Postponed to May 6th: ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఊరట లభించలేదు. ఆమె బెయిల్ పిటీషన్లపై తీర్పును న్యాయస్థానం వాయిదా వేసింది. మే ఆరున తీర్పు ఇస్తామని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ప్రకటించింది. ఈడీ, సీబీఐ రెండు కేసుల్లో బెయిల్ పిటీషన్లపై తుది ఉత్తర్వులు ఇస్తామని న్యాయమూర్తి వెల్లడించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్‌పై తీర్పు వస్తుందని చాలా ఆశగా ఎదురుచూశారు ఆ పార్టీ నేతలు. మార్చి 15న ఈడీ అధికారులు కవితను అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టు జుడీషియల్ కస్టడీ విధించింది. ఈ కేసు విచారణలో భాగంగా ఏప్రిల్ 11న సీబీఐ అరెస్ట్ చేసింది. దీంతో తనకు రెగ్యులర్ బెయిల్ కావాలని కవిత రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు.
కవిత బెయిల్ పిటీషన్లపై ఇదివరకే విచారణ చేపట్టింది ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు. కవిత అరెస్టుకు సరైన కారణాలు లేవని ఆమె తరపు న్యాయవాదులు న్యాయస్థానానికి విన్నవించారు. అయితే సీబీఐ మాత్రం కవితకు బెయిల్ ఇవ్వవద్దని కోర్టుకు తెలిపింది.
Also Read: T-congress Manifesto : తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్.. 5 న్యాయాలు, ప్రత్యేక హామీలు
ముఖ్యంగా లిక్కర్ స్కామ్‌లో కవిత కీలకమైన వ్యక్తని సీబీఐ పేర్కొంది. బెయిల్‌పై ఈడీ, సీబీఐ, ఆమె తరపు వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. మే రెండున తీర్పు వెల్లడిస్తామని తెలిపింది. తాజాగా న్యాయస్థానం వీటిపై తీర్పును మే 6కు వాయిదా వేసింది. ఈలెక్కన కవిత బెయిల్ వస్తుందా? లేక తీహార్ జైలుకేనా అన్న చర్చ బీఆర్ఎస్ నేతల్లో సాగుతోంది.