E-Paper
Advertisement

Addanki Dayakar: బీఆర్ఎస్ అంటే బోగస్ రాష్ట్ర సమితి.. కేటీఆర్, హరీష్ రావులపై ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ విమ‌ర్శ‌లు

Addanki Dayakar: బీఆర్ఎస్ అంటే బోగస్ రాష్ట్ర సమితి.. కేటీఆర్, హరీష్ రావులపై ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ విమ‌ర్శ‌లు
Advertisement

Addanki Dayakar: బీఆర్ఎస్ నాయకుల తీరుపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ నేతలు డ్రగ్స్ తీసుకుని అసెంబ్లీలో మాట్లాడుతున్నట్లు అనిపిస్తోందని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. అందుకే వారు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్నారని ఆరోపించారు. గవర్నర్ ప్రసంగాన్ని చిత్తు కాగితం అని విమర్శించిన వారిని ‘సన్యాసులారా’ అని సంబోధిస్తూ నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ నేతలు ప్రజా పక్షాన ఉంటారో లేక ఫామ్‌ హౌస్‌కే పరిమితం అవుతారో తేల్చుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

బీఆర్ఎస్ అంటే ‘బోగస్ రాష్ట్ర సమితి’ అని ఆయన అభివర్ణించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ధీటుగా ఎదుర్కొనే ప్రతిపక్ష నాయకుడే లేరని ఆయన ఎద్దేవా చేశారు. అసలు తమ పార్టీలో ప్రతిపక్ష నాయకుడు ఎవరో కేటీఆర్, హరీష్ రావు ముందుగా తేల్చుకోవాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం ఆరు గ్యారెంటీ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తుంటే.. దానిని ‘420’ అని క్రియేట్ చేసిన అసలైన 420 గాడు ఎవరో కేసీఆర్, కేటీఆర్ లేదా హరీష్ రావులలో ఎవరో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.

Advertisement

తెలంగాణ సమాజం బీఆర్ఎస్ పదేళ్ల పాలనను చూసి విసిగిపోయిందని.. అందుకే వారిని అధికారం నుంచి దూరం చేశారని గుర్తు చేశారు. ఇప్పటికైనా అబద్ధపు ప్రచారాలు మానుకుని నిర్మాణాత్మకమైన విమర్శలు చేయాలని అద్దంకి దయాకర్ హితవు పలికారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Read Also: BRS : బీఆర్‌ఎస్‌కు షాకివ్వనున్న మాజీ మంత్రి?

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×