E-Paper
Advertisement

Mla Vivek: మంత్రి ప‌ద‌వి వినోద్ కే..? వివేక్ హింట్ ఇచ్చారా?

Mla Vivek: మంత్రి ప‌ద‌వి వినోద్ కే..? వివేక్ హింట్ ఇచ్చారా?
Advertisement

త‌న‌కు మంత్రి ప‌ద‌వి కంటే మాల‌ల అభివృద్ధే ముఖ్య‌మ‌ని చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణ‌లో కేబినెట్ విస్త‌ర‌ణ‌పై చ‌ర్చ జ‌రుగుతున్న స‌మ‌యంలో ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు ఆస‌క్తిక‌రంగా మారాయి. కాకా కుటుంబంలో ఒక‌రికి మంత్రి ప‌ద‌విపై హామీ ల‌భించింద‌ని స్ప‌ష్టం చేశారు. కానీ త‌న‌కు మాత్రం మాల‌ల అభివృద్ధి, హ‌క్కులు ముఖ్య‌మ‌ని చెప్పారు. త్వ‌ర‌లోనే హైద‌రాబాద్ లోని ప‌రేడ్ మైదానంలో మాల‌ల భారీ బ‌హిరంగ స‌భ‌ను నిర్వ‌హిస్తామ‌ని చెప్పారు.

ఈ స‌భ‌కు అంద‌రూ రావాల‌ని, మాల‌ల ఐక్య‌త‌ను చాటుదామ‌ని పిలుపునిచ్చారు. ద‌ళితుల్లో ఉప‌కులాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని, వారంద‌రికీ న్యాయం చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చెప్పారు. అంతే కాకుండా ప్రైవేటు ఉద్యోగాల్లోనూ రిజ‌ర్వేషన్లు క‌ల్పించాల‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. ఇదిలా ఉండ‌గా రాష్ట్రంలో మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ ఆస‌క్తిక‌రంగా మారింది. గ‌త కొద్ది రోజులుగా దీనిపైనే చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ క్ర‌మంలోనే ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాకు మంత్రి ప‌ద‌వి ద‌క్క‌ని కార‌ణంతో ఈ జిల్లాలో ఒక‌రికి మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌నే వార్త‌లు గుప్పుమంటున్నాయి.

Advertisement

ఇక ఉమ్మ‌డి ఆదిలాబాద్ లోనే కాకా వార‌సులు వినోద్, వివేక్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. వినోద్ బెల్లంప‌ల్లి ఎమ్మెల్యేగా ఉంటే, వివేక్ చెన్నూర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మ‌రోవైపు వివేక్ కుమారుడు వంశీ పెద్ద‌ప‌ల్లి ఎంపీగా ఉన్నారు. వివేక్ కు ఎమ్మెల్యే టికెట్, వంశీకి ఎంపీ టికెట్ ఇచ్చారు. వంశీకి ఇచ్చిన టికెట్ ను త‌న పెద‌నాన వినోద్ కూతురు కోసం సైతం అడిగార‌ట‌. కానీ ఆ టికెట్ అధిష్టానం వంశీకి కేటాయించ‌డంతో మంత్రి ప‌ద‌వి వినోద్ కు ఇవ్వాల‌ని నిర్ణ‌యించార‌ట‌. కాబ‌ట్టి మంత్రి ప‌ద‌వి వినోద్ కే ద‌క్కుతుంద‌ని జిల్లాలో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×