E-Paper
Advertisement

MLA Vemula Prashanth Reddy: ఎర్రజొన్న ధర తగ్గకుండా చూడాలి.. కలెక్టర్‌కు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి వినతి

MLA Vemula Prashanth Reddy: ఎర్రజొన్న ధర తగ్గకుండా చూడాలి.. కలెక్టర్‌కు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి వినతి
Advertisement

MLA Vemula Prashanth Reddy: ఎర్రజొన్న సాగు చేసిన రైతులకు గిట్టుబాటు ధర లభించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఎర్రజొన్న సాగు చేసిన రైతులకు గిట్టుబాటు ధర లభించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ జిల్లా బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన కలెక్టర్ ఇలా త్రిపాఠి తో ఫోన్‌లో మాట్లాడారు.

Also Read: Allu Arjun AA22: అల్లు అర్జున్ కోసం షారుఖ్ ఖాన్.. అట్లీ మాస్టర్ ప్లాన్..ఐకాన్ స్టార్ అభిమానులకు పండగే..!

రూ.3,450కి తగ్గించే ప్రయత్నం

Advertisement

వ్యాపారుల సిండికేట్ కావడంతో ధర పడిపోతున్న తీరును ఎమ్మెల్యే ప్రశాంత్​రెడ్డి కలెక్టర్​కు వివరించారు. ​ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీజన్ ప్రారంభంలో క్వింటాల్​కు రూ.3,850 పలికిన ధరను, వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి రూ.3,450కి తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. గతేడాది 34వేల ఎకరాల్లో సాగైన పంట, ఈసారి 23వేల ఎకరాలకే పరిమితమైందన్నారు. ఉత్పత్తి తగ్గినప్పుడు ధర పెరగాల్సి ఉండగా, తగ్గించడం వెనుక కుట్ర ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ యుద్ధాల సాకుతో రైతులను ముంచడం సరికాదని, విత్తనాలు ఇచ్చే సమయంలోనే వ్యాపారులు ‘బైబ్యాక్ అగ్రిమెంట్’ చేసుకోవాలన్న నిబంధనను కఠినంగా అమలు చేయాలని సూచించారు. కలెక్టర్ స్పందిస్తూ.. అధికారులతో సమీక్షించి రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

Also Read: BEL Recruitment 2026: రూ.60వేల జీతంతో బెల్‌లో ఉద్యోగాలు.. ఈ అర్హత ఉన్నవారందరూ అప్లై చేసుకోవచ్చు..!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×