E-Paper
Advertisement

TS Secretariat: కొత్త సచివాలయంలో మంత్రుల కిరికిరి.. ఏంటి సంగతి?

TS Secretariat: కొత్త సచివాలయంలో మంత్రుల కిరికిరి.. ఏంటి సంగతి?
Advertisement
TS new Secretariat

TS Secretariat: తెలంగాణ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా కొత్త సచివాలయం నిర్మించింది. ఏప్రిల్ 30న ప్రారంభోత్సవం కూడా జరగనుంది. కానీ సచివాలయంలో తెలంగాణ మంత్రులకు కొత్త తలనొప్పి వచ్చి పడింది. తెలంగాణ సీఎం కేసీఆర్ తోపాటు మంత్రులు అందరూ వాస్తు నియమాలు తూచ తప్పకుండా పాటిస్తారు. ఇదే ఇప్పుడు కొత్త సెక్రటేరియట్ లో మంత్రులకు తలనొప్పిగా తయారైంది. మంత్రులకు చాంబర్ల కేటాయింపు విషయంలో చిక్కు వచ్చి పడింది.

మంత్రుల చాంబర్ల కేటాయింపులో ‘వాస్తు’ తలనొప్పిగా మారినట్టు తెలుస్తోంది. ఎవరికి వారు నచ్చిన చాంబర్ల కోసం పైరవీలు మొదలు పెట్టారంటున్నారు. ఆధునాతన సాంకేతిక పరిజ్ఝానంతో నిర్మించిన నూతన సచివాలయంలో మంత్రులు తమకు నచ్చిన అంతస్థులను కేటాయించాలని మంత్రులు కోరుతున్నారు. అది కూడా సెంటి మెంట్ కు అనుగుణంగా వాస్తు ప్రకారంగా ఉండాలని అధికారులపై మంత్రులు ఒత్తిడి పెంచుతున్నట్లు సమచారం. మంత్రుల ఒత్తిడితో అధికారులు తలలు పట్టుకుంటున్నారని తెలుస్తోంది. ఏప్రిల్ 30న ప్రారంభానికి సంబంధించి షిఫ్టింగ్ ప్రక్రియ కొనసాగుతుండగా తాత్కాలికంగా కొన్ని శాఖలకు చాంబర్లు కేటాయించినట్లు తెలుస్తుంది.

Advertisement

కొత్త సచివాలయంలో ఆరో ఫ్లోర్‌లో సిఎం కార్యాలయంతో పాటు సిఎస్‌కు చాంబర్ల కేటాయింపు జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్‌లో రెవెన్యూ, మొదటి ప్లోర్‌లో హోం, రెండో అంతస్థులో ఆర్థిక శాఖ, మూడో ఫ్లోర్‌లో అగ్రికల్చర్, ఎస్సీ డెవలప్‌మెంట్ , నాలుగో అంతస్థులో ఇరిగేషన్, ఐదో అంతస్థులో సాధారణ పరిపాలన శాఖలకు కేటాయించారు. తాత్కాలికంగా కేటాయింపులు జరిగినా కొంత మంది కీలక మంత్రులు తమకు నచ్చిన చాంబర్లు కేటాయిచలేదన్న అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. కావాల్సిన చాంబర్ కోసం ఒకరికి మించి ఒకరు పైరవీలు చేస్తున్నట్లు సమాచారం. దీంతో మంత్రుల మధ్య చాంబర్ల కేటాయింపు ఆధిపత్య ధోరణిగా మారిందనే టాక్ వినిపిస్తోంది. మంత్రుల పైరవీలు అధికారులకు తలనొప్పిగా మారాయి.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×