E-Paper
Advertisement

ధాన్యం సేకరణ ప్రక్రియపై ప్రభుత్వం ఫోకస్.. జిల్లా కలెక్టర్లు, అధికారులతో మంత్రి ఉత్తమ్‌కుమార్ భేటీ

ధాన్యం సేకరణ ప్రక్రియపై ప్రభుత్వం ఫోకస్.. జిల్లా కలెక్టర్లు, అధికారులతో మంత్రి ఉత్తమ్‌కుమార్ భేటీ
Advertisement

Hyderabad: యాసంగి పంట ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేసింది తెలంగాణ ప్రభుత్వం. కలెక్టర్‌ మొదలు జిల్లా అధికార యంత్రాంగాన్ని రంగంలోకి దింపింది. నైరుతి రుతుపవనాలు రేపో మాపో కేరళలోకి ప్రవేశించనున్నాయి.  ఆ తర్వాత తెలంగాణకు విస్తరించే అవకాశాలు తెలుస్తోంది. ఈ తరుణంలో ధాన్యం కొనుగోళ్లపై దృష్టి సారించింది.

ధాన్యం సేకరణ ప్రక్రియపై ప్రభుత్వం ఫోకస్

Advertisement

తెలంగాణలో ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు ఎర్రమంజిల్ సివిల్ సప్లైస్ భవనంలో జిల్లా కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు,  ఎమ్మెల్యేలు హాజరవుతున్నారు. ప్రజాప్రతినిధులు నేరుగా మీటింగ్ కు హాజరుకావచ్చని, లేకుంటే ఆన్‌లైన్ ద్వారా పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.

యాసంగి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతం చేసే దిశగా అడుగులు వేసింది ప్రభుత్వం. జిల్లాల కలెక్టర్లు, జిల్లా అధికార యంత్రాంగం అంతా రంగంలోకి దిగేసింది. ఈ నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయనుంది. ఈసారి నైరుతి రుతుపవనాలు మే 26 నాటికి కేరళను తాకవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. అన్నట్లుగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నారు.

Advertisement

జిల్లా కలెక్టర్లు, అధికారులతో మంత్రి ఉత్తమ్‌కుమార్ భేటీ

కేరళలోకి రుతుపవనాలు ప్రవేశించిన వారం లేదా 10 రోజుల్లో తెలంగాణలో విస్తరించే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నమాట. ఈ క్రమంలో ధాన్యం కొనుగోళ్లపై దృష్టి సారించింది. ధాన్యం కొనుగోళ్లను ఇప్పటికే 80 శాతం వరకు పూర్తి చేశామని సీఎం రేవంత్‌రెడ్డి వివరించారు. మరో 20 శాతం పూర్తి కావస్తోందన్నారు.

అయితే ధాన్యం సేకరణ కొనుగోలు కేంద్రాల్లో అనుకున్న స్థాయిలో సేకరణ జరగలేదనే వాదన వినిపిస్తోంది. ధాన్యం వేగంగా సేకరించాలని పలు రాజకీయ పార్టీలు రాస్తారోకోలు, ధర్నాలు చేయనున్నారు. సోమవారం నుంచి బీజేపీ నేతలు కొనుగోలు కేంద్రాలను సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో కొనుగోలు కేంద్రాలను పరిశీలిస్తున్నారు. మిల్లుల వద్ద జాప్యం లేకుండా దృష్టి సారించింది.

ALSO READ: ఇది నిజమేనా.. ఎంపీ అరవింద్‌కు అడ్వాన్స్ కంగ్రాట్యులేషన్స్, బీజేపీ శ్రేణుల విషెస్, అసలు మేటరేంటి?

జిల్లా అధికారులు కొనుగోలు వేగవంతంగా పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. మండల ప్రత్యేక అధికారులు, తహసీల్దారులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేస్తున్నారు.ఈ నేపథ్యంలో మంత్రి ఉత్తమ్ అధికారులతో భేటీ ధాన్యం కొనుగోలు ఎంతవరకు వచ్చింది? ఇంకా కొనుగోలు చేయాల్సింది ఎంత ఉంది? వంటి వివరాలు సేకరించనున్నారు. ఆ తర్వాత అధికారులకు ఆయన సూచనలు చేయనున్నారు.

 

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×