E-Paper
Advertisement

Uttam Kumar Reddy: అతి తెలివి ఎక్కువ.. పని తక్కువ.. బీఆర్ఎస్ పాలనపై ఉత్తమ్ కుమార్ ఆగ్రహం

Uttam Kumar Reddy: అతి తెలివి ఎక్కువ.. పని తక్కువ.. బీఆర్ఎస్ పాలనపై ఉత్తమ్ కుమార్ ఆగ్రహం
Advertisement

Uttam Kumar Reddy: పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టుపై ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం అన్ని ఫోరమ్ లలో వ్యతిరేకిస్తుందని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు.

పోలవరం-నల్లమల ప్రాజెక్టుపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు చూపిస్తున్న లేఖ.. దీనికి సంబంధించినది కాదని ఉత్తమ్ కుమార్ రెడ్డి తేల్చి చెప్పారు. ఈ ప్రాజెక్టు ఇంటర్ స్టేట్ రూల్స్‌కు వ్యతిరేకమని బీఆర్ఎస్‌కి లేఖ రాసినట్లు మంత్రి తెలిపారు.

Advertisement

తమ అభిప్రాయానికి జీఆర్ఎంబీ కూడా సమర్ధించిందని ఉత్తమ్ పేర్కొన్నారు. పోలవరం- నల్లమల్ల ప్రాజెక్టును తెలంగాణ రాష్ట్రమే కాదు మహారాష్ట్ర, కర్ణాటక కూడా వ్యతిరేకిస్తుందని అన్నారు.

సుప్రీంకోర్టులో కొనసాగుతున్న ఈ వ్యవహారంపై కూడా ఉత్తమ్ కుమార్ వివరాలు అందించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి సుప్రీంకోర్టులో వాదనలు బలంగా వినించాలని న్యాయవాది అభిషేక్ సింఘ్వీకి సూచించాం అని తెలిపారు.
కాగా ఈ కేసును వచ్చే సోమవారంకు సుప్రీకోర్టు వాయిదా వేసింది.

Advertisement

రిట్ పిటిషన్‌లో కాదు సూట్ పిటిషన్‌లో రావాలని తమకు సుప్రీంకోర్టు సూచించిందని మంత్రి అన్నారు.

ఈ కేసులో స్టే ఇవ్వాలని సుప్రీంకోర్టును వచ్చే సోమవారం కోరుతాం అని అని స్పష్టం చేశారు.

నెక్ట్స్ విచారణకు తానే డైరెక్ట్ అటెండ్ అవుతానని ఉత్తమ్ అన్నారు. ఒకటి రెండు రోజుల్లో మరోసారి న్యాయవాదులతో సమావేశం అవుతాం అని వెల్లడించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆగింది. గతంలో నిలిచిపోయి ఉంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు చెప్పలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తమ ఒత్తిడి వల్లే ఏపీ ప్రభుత్వం.. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు ఆపేసారని మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ హాయాంలో కృష్ణ- గోదావరి జలాల విషయంలో తెలివి ఎక్కువ పని తక్కువ అన్న విధంగా వ్యవహరించారని ఆయన తీవ్రంగా విమర్శించారు.

అతి తెలివితో తీసుకున్న నిర్ణయాలే బీఆర్ఎస్ తెలంగాణకు భారీ నష్టం చేసిందని అన్నారు. పాలమూరు రంగారెడ్డి ని జూరాల నుంచి శ్రీశైలంకు మార్చి , తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు కాళేశ్వరంను మార్చి భారీ నష్టం చేసారని మంత్రి తెలిపారు.

Also Read: కవితకు సమాధానం చెప్పు హరీష్.. కోమటిరెడ్డి సూటి ప్రశ్నలు

గోదావరి నదిపై అన్ని ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడంతో.. వరద జలాల పేరుతో ఏపీ ప్రాజెక్టులు కట్టేందుకు ప్రయత్నం చేస్తుందని ఉత్తమ్ వ్యాఖ్యానించారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×