E-Paper
Advertisement

Uttam Kumar Reddy: కమీషన్ల కక్కుర్తితో ప్రాజెక్టుల నిలిపివేత: మంత్రి ఉత్తమ్ కుమార్

Uttam Kumar Reddy: కమీషన్ల కక్కుర్తితో ప్రాజెక్టుల నిలిపివేత: మంత్రి ఉత్తమ్ కుమార్
Advertisement

Uttam Kumar Reddy: కమీషన్ల కక్కుర్తి కోసమే బీఆర్‌ఎస్ పాలనలో ప్రాజెక్టులను కేసీఆర్ అండ్ కో నిలిపివేసారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. అందుకే ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టులను నిలిపివేసారని అన్నారు. కాళేశ్వరం వ్యయం రూ. 38,500 కోట్ల నుంచి రూ. 80 వేల కోట్లకు పెంచారని గత పాలకులపై మంత్రి విమర్శలు గుప్పించారు. కాళ్వేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన జలసౌధలో మంత్రి ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రస్తుతం కాగ్ లెక్కల ప్రకారం కాళేశ్వరం పూర్తి కావాలంటే రూ. 1.47 లక్షల కోట్లు అవసరం అని తెలిపారు.

కాళేశ్వరం ప్రాజెక్టు రన్నింగ్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ అని అన్నారు. ప్రాజెక్టులోని అన్ని పంపులను పూర్తి స్థాయిలో రన్ చేస్తే కరెంట్ బిల్లు రూ.10 వేల కోట్లు వస్తుందని తెలిపారు. ప్రాజెక్టు కోసం అధిక మొత్తంలో రుణాలు తీసుకున్నారు. ఏడాదికి కాళేశ్వరంపై రూ. 15 వేల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోంది. దాదాపు రూ. 94 వేల కోట్లు ఖర్చు చేస్తే కాళేశ్వరం క్రింద కేవలం 93 వేల ఎకరాలు మాత్రమే కొత్త ఆయకట్టు సాగులోకి వచ్చింది.

Advertisement

Also Read: అసెంబ్లీ సమావేశాలలోగా ఆ పని చెయ్యకపోతే..50 వేల మంది రైతులతో వస్తాం: కేటీఆర్

మేడిగడ్డపై కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. మేడిగడ్డ మొదలు పెట్టినప్పుడు, కూలినప్పడు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది. మేడిగడ్డలో పిల్లర్లు 6 అడుగులు లోపలికి కుంగిపోయాయి. నాసిరకంగా ప్రాజెక్టు నిర్మించడం వల్లే బ్యారేజీ కుంగిపోయిందని ఎన్టీఎస్ వెల్లడించింది. ఎన్టీఎస్ నివేదికపై కూడా బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తోంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కేంద్ర చట్టం ద్వారా ఏర్పాటు చేశారని మంత్రి ఉత్తమ్ కుమార్ అన్నారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×