E-Paper
Advertisement

Minister Sridharbabu: వ్యవస్థలను కాలరాసిన వ్యక్తులు మాట్లాడుతుంటే ‘నాకు నవ్వొస్తుంది’: మంత్రి శ్రీధర్ బాబు

Minister Sridharbabu: వ్యవస్థలను కాలరాసిన వ్యక్తులు మాట్లాడుతుంటే ‘నాకు నవ్వొస్తుంది’: మంత్రి శ్రీధర్ బాబు
Advertisement

Minister Sridharbabu on BRS: బీఆర్ఎస్ పార్టీ నేతలపై మంత్రి శ్రీధర్ బాబు మరోసారి తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘వ్యవస్థలను కాలరాసిన వ్యక్తులు ఇప్పుడు మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ నేతలు గతంలో ఎలా వ్యవహరించారో అనేది అందరికీ తెలుసు. ఇప్పుడు వారు మాట్లాడుతుంటే నాకు నవ్వొస్తుంది. వారు మాట్లాడుతున్న తీరును చూసి ఏం మాట్లాడాలో అర్థమవడంలేదు. పీఏసీ చైర్మన్ బీఆర్ఎస్ నేత అని స్వయంగా చెప్పుకున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను కూల్చింది బీఆర్ఎస్సే. నిబంధనల ప్రకారమే పీఏసీ చైర్మన్ పదవి నియామకం జరిగింది’ అంటూ ఆయన పేర్కొన్నారు.

Also Read: బీసీ కుల గణనపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు… 3 నెలల్లోపు..

Advertisement

నియమ నిబంధనల ప్రకారమే అసెంబ్లీ కమిటీల నియామకం జరిగింది. పీఏసీ చైర్మన్ ను కూడా శాసనసభ నిబంధనల ప్రకారమే స్పీకర్ నియమించారు. దీనిపై బీఆర్ఎస్ నేతలు అనవసర రాద్దాంతం చేస్తున్నారు. నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేను అని పీఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీ చెప్పారు. బీఆర్ఎస్ నేతలతో పీఏసీ చైర్మన్ కు అభిప్రాయభేదాలు ఉంటే మాకేం సంబంధం? రాష్ట్రంలో సర్కారును నడపాలని ప్రజలు మాకు తీర్పు ఇచ్చారు.

Also Read: మీ ప్లానింగ్ బాగుంది.. తెలంగాణ ప్రభుత్వంపై ఆర్థిక సంఘం ప్రశంసలు

Advertisement

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత కూడా రాష్ట్రంలో ఏదో జరుగుతదని బీఆర్ఎస్ నేతలు కొన్ని రోజులు తిరిగారు. అంత తిరిగిన తరువాత కూడా ప్రజలు మరోసారి బ్రహ్మండమైన తీర్పు ఇచ్చారు. వారికి ఒక్కటంటే ఒక్క సీటు ఇవ్వలేదు. బీఆర్ఎస్ వైఖరి ఇంకా మారడంలేదనే లోక్ సభ ఎన్నికల్లోనూ ప్రజలు జీరో తీర్పు ఇచ్చారు. జీరో ఎంపీ సీట్లు ఇచ్చినా కూడా ఆ పార్టీ నేతల వైఖరి ఇంకా మారడంలేదు. ఇంతకు రాజ్యాంగ స్ఫూర్తి గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ పార్టీకి లేదు. ఇప్పటికైనా బీఆర్ఎస్ నేతలు వ్యవస్థలను గౌరవించాలి’ అంటూ శ్రీధర్ బాబు పేర్కొన్నారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×