E-Paper
Advertisement

Minister Sithakka : హ‌రీష్.. అబ‌ద్ధాలు మానుకో!

Minister Sithakka : హ‌రీష్.. అబ‌ద్ధాలు మానుకో!
Advertisement

Minister Sithakka:

⦿ వాస్త‌వాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది

Advertisement

⦿ అదే పనిగా బుదర జల్లడం కాదు

⦿ అధికారం దూరం కావ‌డాన్ని త‌ట్టుకోలేకే త‌ప్పుడు ఆరోప‌ణ‌లు

Advertisement

⦿ గ్రామ పంచాయ‌తీ భ‌వ‌నం తాకట్టు ట్వీట్‌పై మంత్రి సీత‌క్క ఫైర్

 

హైదరాబాద్, స్వేచ్ఛ: జగిత్యాల జిల్లా తొంబరావుపేట గ్రామంలో గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి సంబంధించి 17 లక్షల బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లుగా ఒక పత్రికలో కథనం రావటం, దాన్ని క‌నీసం చెక్ చేసుకోకుండానే మాజీ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేయడం పట్ల మంత్రి సీత‌క్క తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

నిత్యం మీడియా, సోష‌ల్ మీడియాలో ఉండేందుకు పాకులాడుతూ, త‌ప్పుడు ప్ర‌చారం చేయ‌డాన్నే హ‌రీష్ ప‌నిగా పెట్టుకున్నార‌ని మండిప‌డ్డారు. గత నెల 19 నే మాజీ స‌ర్పంచ్ మామిడి స‌త్త‌మ్మ‌కు రూ.7,46,787 చెక్‌ల‌కు ఇవ్వ‌గా 23 అక్టోబ‌ర్‌న విత్ డ్రా చేసుకున్న‌ట్లు అధికారులు మంత్రి సీత‌క్క దృష్టికి తీసుకొచ్చారు. ఇంకా గ్రామ పంచాయతీ భవన నిర్మాణం పూర్తి కాలేదని, ప్లాస్టరింగ్ పనులు పెండింగ్‌లో ఉన్నాయ‌ని, పనులు పూర్తి చేసిన తర్వాత బిల్లులు స‌మ‌ర్పించాల‌ని మాజీ స‌ర్పంచ్‌కు అధికారులు సూచించగా, ఇప్ప‌టి వ‌ర‌కు బిల్లులు స‌మ‌ర్పించ‌లేద‌ని జిల్లా అధికారులు మంత్రికి నివేదిక సమ‌ర్పించారు. దీనిపై మంత్రి సీత‌క్క తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

వాస్త‌వాలు తేలుసుకోకుండా హ‌రీష్ రావు ట్వీట్ చేయ‌డాన్ని త‌ప్పుబ‌ట్టారు. లేని అంశాలున్న‌ట్లు భ్ర‌మింప చేయ‌డాన్ని హ‌రీష్ రావు మానుకోవాల‌ని సూచించారు. అవ‌స్త‌వాల‌ను ప్ర‌చారం చేసి అధికారంలోకి వ‌చ్చేందుకు హ‌రీష్ ఆరాట ప‌డుతున్నార‌ని మండిప‌డ్డారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×