E-Paper
Advertisement

Seethakka: మిషన్ భగీరథతో ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టాలి.. మంత్రి సీతక్క దిశానిర్దేశం

Seethakka: మిషన్ భగీరథతో ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టాలి.. మంత్రి సీతక్క దిశానిర్దేశం
Advertisement

Seethakka: తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: గ్రామీణ ప్రజలకు నిరంతర, నాణ్యమైన తాగునీటి సరఫరా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి సీతక్క (Seethakka) స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్‌లో గల మిషన్ భగీరథ కార్యాలయంలో గ్రామీణ తాగునీటి సరఫరా, వేసవి సన్నద్ధతప సమీక్ష సమావేశం నిర్వహించారు. మిషన్ భగీరథ సోర్స్ పాయింట్లు, రిజర్వాయర్లలో నీటి లభ్యత, పంపింగ్ వ్యవస్థ, గ్రామాలవారీగా సరఫరా పరిస్థితులపై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రస్తుతం రిజర్వాయర్లలో తగినంత నీరు నిల్వలో ఉందని, వేసవిలోనూ పెద్ద ఇబ్బందులు ఉండవని వివరించారు. ప్రతి ఎస్‌ఈ పరిధిలో ఇంటింటికి తాగునీరు అందుతున్న పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకుని, ఎక్కడైనా లోపాలు ఉంటే వెంటనే సరిదిద్దాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 24 వేల ఆవాసాల్లో కేవలం 150 ఆవాసాలకు మాత్రమే మిషన్ భగీరథ నీరు అందడం లేదని, ఇటీవల కొత్తగా 397 ఆవాసాలు ఏర్పాటయ్యాయని అధికారులు తెలిపారు.

Also Read: Vaibhav Suryavanshi Car: డ్రైవింగ్ లైసెన్స్ లేని వైభవ్ సూర్యవంశీకి టాటా మోటార్స్ కారు..ధ‌ర‌, ఫీచ‌ర్స్ ఇవే

నిరంతర తాగునీటి సరఫరా చేయాలి 

Advertisement

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కొండలపై, అటవీ ప్రాంతాల్లో పైప్‌లైన్ వేయడం సవాల్‌గా ఉన్న చోట్ల స్థానిక జల వనరులను వినియోగించి ప్రత్యామ్నాయ పద్ధతుల్లో నిరంతర తాగునీటి సరఫరా చేయాలని ఆదేశించారు.ప్రతి ఇంటికి తాగునీరు అందించడమే మిషన్ భగీరథ లక్ష్యమన్నారు. వేసవి దృష్ట్యా ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టాలని సూచించారు. సర్పంచ్‌లతో సమన్వయం చేసుకుని గ్రామాల వారీగా సరఫరా పరిస్థితిని సమీక్షించి, సరఫరా జరిగిందని వారి సంతకాలు తీసుకోవాలని తెలిపారు. సర్పంచ్‌ల ఫోన్ కాల్స్‌కు తక్షణ స్పందన ఇవ్వాలని, సమస్యలు వచ్చిన వెంటనే పరిష్కరించాలని స్పష్టం చేశారు.గ్రామసభల్లో మిషన్ భగీరథ నీటి వినియోగంపై తీర్మానాలు చేయించి అవగాహన పెంచాలని సూచించారు.

Also Read: Indian Restaurant Closure: పాక్ వేధింపులు.. లండన్‌లో మూతపడ్డ భారత రెస్టారెంట్.. యజమాని భావోద్వేగం!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×