E-Paper
Advertisement

Advocate Murder: యువ న్యాయవాది హత్య ఘటనపై మంత్రి సీతక్క సీరియస్.. కఠినంగా శిక్షించాలని డిమాండ్!

Advocate Murder: యువ న్యాయవాది హత్య ఘటనపై మంత్రి సీతక్క సీరియస్.. కఠినంగా శిక్షించాలని డిమాండ్!
Advertisement

Advocate Murder: స్వేఛ్చ బ్యూరో: మహిళ న్యాయవాదిని అత్యంత పాశవికంగా హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని మంత్రి సీతక్క కోరారు. మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లిలో ఆస్తి వివాదం కారణంగా ఒక యువ న్యాయవాది మంగళవారం దారుణంగా హత్యకు గురైన ఘటన తనను కలచివేసిందని మంత్రి సీతక్క తెలిపారు. ఆస్తులు, ఆర్థిక కారణాల పేరుతో రక్తసంబంధాలు తెగిపోవడం, మానవీయ బంధాలు నశించిపోవడం మన సమాజం ఎదుర్కొంటున్న అత్యంత విషాదకర పరిస్థితిగా మారిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సోదర బంధం వంటి పవిత్రమైన సంబంధాలు కూడా ఆస్తుల కోసం హింసకు, హత్యలకు దారి తీస్తుండటం తీవ్రంగా కలవరపెడుతోందని మంత్రి పేర్కొన్నారు.

Also Read: Aadhaar Deactivates: మోసాలు జరగకుండా కేంద్రం నిర్ణయం.. 2.5 ఆధార్‌ నెంబర్లు డియాక్టివేట్‌, కేంద్రమంత్రి వెల్లడి

చర్యలు తీసుకుంటామని భరోసా..

Advertisement

న్యాయవృత్తిని ఎంచుకుని సమాజానికి సేవ చేయాలనుకున్న ఒక యువతి ఇలాంటి దారుణానికి బలవడం అత్యంత బాధాకరమని అన్నారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులకు ఆమె ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, వారికి న్యాయం జరిగేలా ప్రభుత్వం తరఫున అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఆస్తి వివాదాలకు హింసే పరిష్కారం అన్న భావన సమాజంలో పెరగడం ప్రమాదకరమని, సమస్యలను చర్చలు, న్యాయపరమైన మార్గాల్లో పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని ఆమె పిలుపునిచ్చారు. మానవ విలువలు, కుటుంబ బంధాల ప్రాధాన్యతను ప్రతి ఒక్కరూ గుర్తించాల్సిన అవసరం ఉందని మంత్రి సీతక్క పేర్కొన్నారు.

Also Read: Sumathi Sathakam Amardeep: రవితేజ మాస్టారూ ప్రశంసల వరకేనా..అవకాశం ఏమైనా ఉందా?

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×