E-Paper
Advertisement

Seethakka: ఫిరాయింపులకు పురుడు పోసిందే బీఆర్ఎస్.. మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు

Seethakka: ఫిరాయింపులకు పురుడు పోసిందే బీఆర్ఎస్.. మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు
Advertisement

Seethakka:  కేసీఆర్ ఫిరాయింపుల పితామహుడు అంటూ మంత్రి సీతక్క విమర్శించారు. బుధవారం ఆమె గాంధీభవన్ లో మాట్లాడుతూ..బీఆర్ ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కొనుగోలు చేశారని ఆరోపించారు. ఫిరాయింపులకు పురుడు పోసిందే బీఆర్ ఎస్ ప్రభుత్వం అని చెప్పారు. కొత్తగా ఏర్పాడిన తెలంగాణలో ఫిరాయింపులను ప్రోత్సహించారన్నారు. ఇక గాంధీభవన్ లో జరిగిన ఎస్టీ సంఘాల మీటింట్ లో ఆమె మాట్లాడుతూ..ఎస్టీ సామాజిక వర్గ ప్రజలంతా ఏకం కావాల్సిన తరుణమిది అంటూ ఆమె వివరించారు.

Also Read: Ramchander Rao: రాజ్యాంగాన్ని ఖూనీ చేసిన చరిత్ర కాంగ్రెస్‌దే.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు

బీజేపీ పాలనతో ఎస్టీ లకు తీవ్ర అన్యాయం

Advertisement

ఆదివాసీ గిరిజన ఏజెన్సీ ఏరియా ల మీద కార్పొరేట్లు దాడి చేస్తున్నారని, అటవీ సంపదను మైనింగ్ పేరుతో మన కొండలను గుట్టలను కొల్లగొడుతున్నారన్నారు. వారిని మనమంతా ఐక్యంగా అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు మొదటినుంచి ఎస్సీ, ఎస్టీలకు అనగారిన వర్గాలకు అండగా నిలిచాయని, రాజ్యాంగంలో ప్రత్యేక రక్షణను కల్పించాయన్నారు ఫిఫ్త్ షెడ్యూల్, సిక్స్త్ షెడ్యూల్, పెస చట్టాలు తెచ్చి ఎస్టీలకు కాంగ్రెస్ రక్షణ కవచంగా నిలిచిందన్నారు. ఆదివాసి గిరిజనులకు కాంగ్రెస్ పార్టీ శ్రీరామరక్ష అంటూ వెల్లడించారు. తొలి ప్రధాని నెహ్రూ మొదలుకొని, రాహుల్ గాంధీ వరకు ఎస్టీల అభివృద్ధి కోసం పనిచేస్తున్నారన్నారు. కానీ బీఆర్ ఎస్ బీజేపీ పాలనతో ఎస్టీ లకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితే దేశం బాగుపడుతుందన్నారు.

Also Read: Team India: బికినీ భామ‌తో టీమిండియా ప్లేయ‌ర్ ఎఫైర్‌.. ఈ లేడీ త‌ప్ప ఇంకెవ‌రు దొర‌క‌లేద‌రా

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×