E-Paper
Advertisement

Telangana New Busses: రోడ్డెక్కనున్న 80 కొత్తబస్సులు.. పురుషుల కష్టాలు తీరేనా ?

Telangana New Busses: రోడ్డెక్కనున్న 80 కొత్తబస్సులు.. పురుషుల కష్టాలు తీరేనా ?
Advertisement
ts news updates

Telangana New Busses news(TS news updates):

ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు.. తెలంగాణ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తూనే ఉంది. అధికారంలోకి వచ్చిన వెంటనే.. ప్రజాపాలన మొదలుపెట్టారు. సీఎం రేవంత్‌ పాలనపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందించేందుకు TSRTC నిరంతరం పనిచేస్తోంది. రవాణా రంగంలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ వినూత్న పద్దతుల ద్వారా ప్రయాణికులకు చేరువ అవుతోంది.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం స్కీంమ్‌ వల్ల పెరిగిన రద్దీకి అనుగుణంగా.. కొత్త బస్సులను తీసుకొచ్చారు. అత్యాధునిక హంగులతో కూడిన 80 కొత్త బస్సు లు నేటి నుంచి అందుబాటులోకి వస్తున్నాయి. వాటిలో 30 ఎక్స్‌ప్రెస్, 30 రాజధాని ఏసీ, 20 లహరి స్లీపర్ కమ్ సీటర్ నాన్ ఏసీ బస్సులున్నాయి. ఈ కొత్త బస్సులను ఎన్టీఆర్ మార్గ్‌లోని అంబేద్క ర్ విగ్రహం వద్ద మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఉదయం 10 గంటలకు ప్రారంభించనున్నారు.

Advertisement

అందులో భాగంగానే ప్రయాణికుల సౌకర్యార్థం కొత్త బస్సులను కొనుగోలు చేస్తోంది. ఈ ఆర్థిక ఏడాదికి గాను 400 కోట్ల వ్యయంతో అధునాతనమైన 1050 కొత్త డీజిల్ బస్సు లను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. వాటిలో 400 ఎక్స్ ప్రెస్, 512 పల్లె వెలుగు, 92 లహరి స్లీపర్ కమ్ సీటర్, 56 ఏసీ రాజధాని బస్సులున్నాయి. వీటికి తోడు పర్యావరణహితమైన ఎలక్ట్రిక్ వాహనాలను హైదరాబాద్ సిటీలో 540, తెలంగాణలో ఇతర ప్రాంతాలకు 500 బస్సు లను TSRTC అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ బస్సులన్నీ విడతల వారీగా మార్చి 2024 నాటికి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువచ్చేలా TSRTC ప్లాన్ చేసింది.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×