E-Paper
Advertisement

Ponnam Prabhakar: పదేళ్లలో ఏం చేశారు.. సమాధానం చెప్పండి.. బీఆర్ఎస్‌కు పొన్నం సవాల్!

Ponnam Prabhakar: పదేళ్లలో ఏం చేశారు.. సమాధానం చెప్పండి.. బీఆర్ఎస్‌కు పొన్నం సవాల్!
Advertisement

Ponnam Prabhakar: గత రెండేళ్లలో ఏం చేశారని తమని అడిగే ముందు 10 సంవత్సరాలుగా మీరేం చేశారో జవాబు చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. శాసనమండలిలో మంగళవారం ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కు ఆయన కౌంటర్ ఇచ్చారు. గత 10ఏళ్లుగా పరిపాలించిన ప్రభుత్వానికి అమరవీరులపై, తెలంగాణ ఉద్యమకారులపై చిత్తశుద్ధి లేదని అందరికీ తెలుసన్నారు. కానీ రేవంత్ సర్కార్.. ఉద్యమకారుల ఆకాంక్షలను నెరవేర్చేందుకు అహర్శిశలు శ్రమిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం.. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా విధివిధానాలు రూపొందిస్తోందని పొన్నం అన్నారు. వాటిని ఖరారు చేసేలా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ ఉద్యమకారులకు సముచిత న్యాయం చేస్తామని ఈ సందర్భంగా పొన్నం హామీ ఇచ్చారు. మరోవైపు గత పదేళ్లలో ఉద్యమకారులకు ఏం చేశారని కేసీఆర్ కుటుంబ సభ్యులే విమర్శిస్తున్నారని పొన్నం ఎద్దేవా చేశారు.

Advertisement

గత బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ గీతాన్ని , తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు గుర్తించలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదే తమ తెలంగాణ తల్లి విగ్రహం అని చట్టం ఎందుకు చేయలేదన్నారు. తాము ఏమైనా అడ్డుకున్నామా? అని నిలదీశారు. అందరినీ సంప్రదించిన తర్వాతే తెలంగాణ తల్లి రూపాన్ని గ్రామీణ ప్రాంత మహిళను ప్రతి బింబించేలా ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసి సెక్రటేరియట్ గుండెల్లో పెట్టుకున్నామన్నారు.

పేద, ధనిక, కులాలకు అతీతంగా ఆడుకుని జరుపుకునే బతుకమ్మను తన పెటెంట్ లాగా బీఆర్ఎస్ మాట్లాడుతోందని పొన్నం విమర్శించారు. ఉద్యమ ఆకాంక్షను నెరవేర్చుకునే క్రమంలోనే టీఎస్ నుంచి టీజీగా మార్చుకున్నామన్నారు. తెలంగాణ తల్లి విగ్రహానికి చట్టం తెచ్చామని, ఎవరైనా క్రిటిసిజం చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకునేలా చేశామని వెల్లడించారు.

Advertisement

Also Read: Airtel Recharge: సూపర్ డూపర్ ప్లాన్.. 3 నెలల పాటు.. అపరిమిత 5G డేటా, ఫ్రీ నెట్‌ఫ్లిక్స్, కాల్స్!

అటు బలహీన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం చట్టం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా పొన్నం గుర్తుచేశారు. అది కేంద్రం పరిధిలో ఉందన్నారు. బీఆర్ఎస్ నేతలు సర్వే లో పాల్గొనకుండా, రిజర్వేషన్లు అడ్డుకునే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. సామాజిక న్యాయానికి ఛాంపియన్ కాంగ్రెస్ పార్టీ అన్నారు. బలహీన వర్గాలకు న్యాయం చేసేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని వెల్లడించారు. ఆనాడు బలహీన వర్గాల రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో కోట్లాడుదాము ఆహ్వానిస్తే.. బీఆర్ఎస్ ముందుకు రాలేదని పొన్నం అన్నారు.

Also Read: Croma Deals: ఇండక్షన్ స్టవ్స్‌పై.. అదిరిపోయే డిస్కౌంట్లు.. ఇప్పుడు కాక‌ ఇంకెప్పుడు!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×