E-Paper
Advertisement

Ponnam Prabhakar: తెలంగాణకు సాయం ఎక్కడ? చివరకు సభలా-మంత్రి పొన్నం ప్రశ్నలు

Ponnam Prabhakar: తెలంగాణకు సాయం ఎక్కడ? చివరకు సభలా-మంత్రి పొన్నం ప్రశ్నలు
Advertisement

Ponnam Prabhakar: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది అయిన సందర్భంగా ఓ వైపు ప్రజా విజయోత్సవాలు నిర్వహిస్తోంది. ఇదే సమయంలో పాలకపక్షం వైఫల్యాలపై బీజేపీ సరూర్ నగర్‌లో బహిరంగ సభకు ప్లాన్ చేసింది. ఈ క్రమంలో బీజేపీపై రుసరుసలాడారు మంత్రి పొన్నం ప్రభాకర్.

చారిత్రాత్మక ప్రాంతం చార్మినార్ నుంచి బీజేపీపై పలు ప్రశ్నలు సంధించారు మంత్రి పొన్నం. గడిచిన 11 ఏళ్లలో తెలంగాణ‌కు మోదీ సర్కార్, ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణకి ఏమి ఇవ్వక పోగా, గత ప్రభుత్వం అడగలేదనే నెపంతో దాట వేసే ధోరణిని తప్పుబట్టారు.

Advertisement

బడ్జెట్‌లో నిధులు కేటాయించకుండా మొన్న వరదలు వచ్చినప్పుడు నష్ట పరిహారం ఇవ్వకుండా తెలంగాణపై వివక్ష చూపలేదా అంటూ సూటిగా ప్రశ్నించారు. గతంలో ఆర్కియాలజీ- టూరిజం మంత్రిగావున్న కిషన్‌రెడ్డి మీ ముద్ర ఏది? హైదరాబాద్ నగరానికి ఏం చేశారనేది సరూర్ నగర్ సభలో చెప్పాలని డిమాండ్ చేశారు.

హైదరాబాద్ అంటే చెరువులకు కేరాఫ్ అని, దాన్ని బాగు చేసుకోవడం తమ బాధ్యతగా చెప్పుకొచ్చారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తమ ప్రభుత్వం కేంద్రాన్ని అన్నిరకాలుగా తెలంగాణకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. కానీ ఎలాంటి చలనం లేదన్నారు. ముమ్మాటికీ తెలంగాణ ప్రయోజనాలకు నెరవేరుస్తున్నామని చెప్పుకొచ్చారు.

Advertisement

ALSO READ:  సీఎం రేవంత్ మనసులోని మాట.. తెలంగాణలో ప్రభుత్వానికి ఏడాది

శనివారం సాయంత్రం సరూర్ నగర్‌లో బీజేపీ బహిరంగ సభకు ప్లాన్ చేసింది. దీనికి ముఖ్య అతిధిగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వస్తున్నారు. ఈ క్రమంలో ఆయన పలు ప్రశ్నలు లేవనెత్తారు. ఈ సభలో తెలంగాణకు ఏమైనా ఇస్తామని నడ్డా ప్రకటన చేస్తారా లేదో చూడాలి. ఐఐఎం కావాలని తెలంగాణ నేతలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. దానిపై ఆయన నోరు విప్పుతారా లేదా అనేది చూడాలి.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×