E-Paper
Advertisement

Minister Ponguleti: కల్లూరు గడ్డపై ‘గులాబీ’ గూండాయిజం సాగనివ్వం.. మంత్రి పొంగులేటి ఫైర్..!

Minister Ponguleti: కల్లూరు గడ్డపై ‘గులాబీ’ గూండాయిజం సాగనివ్వం.. మంత్రి పొంగులేటి ఫైర్..!
Advertisement

Minister Ponguleti: స్వేఛ్చ బ్యూరో: “అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేని అసమర్థులు.. ఇప్పుడు రంగురంగుల కండువాలు వేసుకుని మాయ మాటలతో వస్తున్నారు. గతంలో మనం ఒక వ్యక్తిని నమ్మి గెలిపించుకుంటే.. పాముకు పాలు పోసినట్లు అయ్యింది. ఆ పాము ఇప్పుడు విషం కక్కుతోంది!” అంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి బీఆర్ఎస్ పార్టీపై ధ్వజమెత్తారు. బుధవారం కల్లూరు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన రోడ్ షోలో పొంగిలేటి ప్రసంగం విపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది.

సొల్లు పురాణాలు చెప్తే సరిపోతుందా?

వార్డుల్లోకి వస్తున్న బీఆర్ఎస్ నాయకులను నిలదీయాలని ప్రజలకు మంత్రి పిలుపునిచ్చారు. “మీ దగ్గర ఎమ్మెల్యే లేడు, మంత్రి లేడు, పోనీ నిధులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి లేడు. మరి ఏముందని ప్రగల్భాలు పలుకుతున్నారు? ఎలా అభివృద్ధి చేస్తారో ప్రజలకు స్పష్టంగా చెప్పండి” అని సవాల్ విసిరారు. మభ్యపెట్టే మాటలు, సొల్లు పురాణాలు చెప్పి ఓట్లు కొల్లగొట్టాలని చూస్తే కల్లూరు ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు.

Advertisement

Also Read: GHMC: జీహెచ్ఎంసీలో ఆగని అవినీతి రాజాలు.. వరుసగా ఏసీబీకి చిక్కుతున్న అధికారులు

చందాలకి.. దందాలకి ఇక సెలవు!

గత ప్రభుత్వంలో సాగిన చందాల, దందాల రాజకీయాలకు ఈ గడ్డపై ఇక స్థానం లేదని మంత్రి స్పష్టం చేశారు. విపక్ష నాయకులు, వారి తొత్తులు అహంకారంతో మాట్లాడుతున్నారని, వారి అహంకారాన్ని అణిచివేయాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు. “ఇది నా గడ్డ.. నా ఊరు. ఇక్కడ పుట్టి పెరిగిన వాడిగా చెప్తున్నా.. అభివృద్ధి చేసే సత్తా నాకుంది. చేతకాని వారు పగటి కలలు కంటున్నారు” అని ఎద్దేవా చేశారు.

అసమర్థులకు బుద్ధి చెప్పే విప్లవం

Advertisement

20కి 20 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించడం ద్వారా బీఆర్ఎస్ అసమర్థతకు చరమగీతం పాడాలని మంత్రి పిలుపునిచ్చారు. నాయకులు రానక్కర్లేదని, ప్రజలే ఒక విప్లవంలా కదిలి హస్తం గుర్తుకు ఓటు వేసి విపక్షాల అడ్రస్ గల్లంతు చేస్తారని ధీమా వ్యక్తం చేశారు.

Also Read: Romantic Movie OTT : కొరియా వీధుల్లో థాయ్ జంట… పేరు తెలీకుండానే ప్రేమలో… ప్రేమికులు చూడాల్సిన మూవీ

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×