E-Paper
Advertisement

Telangana Assembly: ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు, వివరాలన్నీ బయటకు

Telangana Assembly: ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు, వివరాలన్నీ బయటకు
Advertisement

Telangana Assembly: ఇందిరమ్మ ఇళ్లపై కీలక వ్యాఖ్యలు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. జీహెచ్ఎంసీ పరిధిలో 26 వేల ఇళ్ల నిర్మాణం జరిగిందన్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.730 కోట్ల ఖర్చు చేసిందన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం లబ్ధిదారులకు నగర శివారు ప్రాంతంలో వాటి నిర్మాణం చేసిందననారు. అక్కడ ఉండటానికి చాలా మంది ఇష్టపడలేదన్నారు.

ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు

Advertisement

వారు పనులు చేసే ప్రాంతానికి దూరంగా ఉండడమే ఇందుకు కారణమని తేల్చేశారు. ప్రస్తుతం 12 వేల ఇళ్లలో లబ్ధిదారులు ఉండడం లేదన్నారు. వాటిలో కొల్లూరు, మేడ్చెల్ ప్రాంతాల్లో లబ్ధిదారులు ఉండలేదన్నారు. పార్టీలకు అతీతంగా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందన్నారు. గ్రామ సర్పంచ్ ఇందిరమ్మ ఇంటిని ఫైనల్ చేస్తారని గుర్తు చేశారు.

ఇందిరమ్మ కమిటీ నుండి కలెక్టర్లకు వివరాలు వెళ్తాయని, మే మొదటి వారంలో రెండో విడత ఇళ్ళ మంజూరు జరుగుతుందన్నారు. ఇందిరమ్మ ఇల్లు పూర్తయినా కాకపోయినా లబ్ధిదారులను ఫైనల్ చేస్తామని క్లారిటీ ఇచ్చారు. మంచి చేయకపోయినా పర్వాలేదని, ఆశ చూపి మోసం చేస్తే ప్రతి సామాన్యుడు గుర్తు పెట్టుకుంటారని చెప్పకనే చెప్పారు.

Advertisement

జీహెచ్ఎంసీ పరిధిలో ఇళ్ల వివరాలు బయటకు

అసెంబ్లీ సమావేశాల్లో బుధవారం ఇందిరమ్మ ఇళ్లపై సభలో ఆయన ఈ ప్రకటన చేశారు. గత ప్రభుత్వాలు ప్రారంభించిన ఇళ్ల నిర్మాణాలు పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయడంపై దృష్టి సారించామన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు పథకం ద్వారా భారీ స్థాయిలో నిర్మాణాలు చేసిందన్నారు.

మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో 21 లక్షల ఇళ్లు నిర్మించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్‌లో లక్ష ఇళ్లకు అనుమతులు ఇచ్చిందన్న ఆయన, వాటిలో అనేక పనులు పూర్తి కాలేదన్నారు. సుమారు 70 వేల ఇళ్లలో పనులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయన్నారు. మరో 26 వేల ఇళ్లు అసంపూర్తిగా ఉన్నాయని సభకు వివరించారు.

ALSO READ: రియల్ ఎస్టేట్ షేక్.. బిల్డర్లకు సర్కార్ ఇచ్చిన ‘జాక్‌పాట్’ ఆఫర్ ఇదే!

గత ప్రభుత్వం కేటాయించిన 12 వేల ఇళ్లను ఇప్పటికీ లబ్ధిదారులు తీసుకోలేదన్నారు. ఈ క్రమంలో లబ్ధిదారులకు మూడు నెలల గడువు ఇచ్చి నోటీసులు జారీ చేశామని, అందులో 6 వేల మంది ఆక్యూపై చేసుకున్నారన్నారు. మిగిలిన ఇళ్లను అర్హులైన లబ్ధిదారులకు కేటాయిస్తామన్నారు. పూర్తి కాకుండా ఉన్న ఇళ్లను ఎంత ఖర్చు అయినా పూర్తి చేస్తామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల అంశంపై అన్ని పార్టీల నేతలతో కలిసి త్వరలో సమీక్ష సమావేశం నిర్వహిస్తామని తెలియజేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×