E-Paper
Advertisement

Ponguleti Srinivasa Reddy: పురపోరులో పొంగులేటి మ్యాజిక్.. 10 రోజుల ప్రచారంతో.. 70 శాతం సక్సెస్ రేట్

Ponguleti Srinivasa Reddy: పురపోరులో పొంగులేటి మ్యాజిక్.. 10 రోజుల ప్రచారంతో.. 70 శాతం సక్సెస్ రేట్
Advertisement

Ponguleti Srinivasa Reddy: మున్సిపల్ ఎన్నికల కురుక్షేత్రంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అజేయ శక్తిగా నిలిచారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పగించిన బాధ్యతను సవాలుగా తీసుకున్న ఆయన, తన వ్యూహ చతురతతో ఫలితాలను తలకిందులు చేశారు. కేవలం అంకెలే కాదు.. ఆ అంకెల వెనుక ఉన్న ఆయన కష్టం, ప్రచారం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కేవలం 10 రోజుల్లోనే అసాధ్యమనుకున్న సమీకరణాలను సుసాధ్యం చేసి చూపారు.

తిరుగులేని హవా!

తన సొంత గడ్డపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సునామీ సృష్టించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఆయన అడుగుపెట్టిన ప్రతీచోటా కాంగ్రెస్ జెండా రెపరెపలాడింది. ఏదులాపురం మున్సిపాలిటీల్లోని 32 వార్డుల్లో ఏకంగా 24 చోట్ల జయకేతనం ఎగురవేసి కాంగ్రెస్ సత్తా చాటింది. కొత్తగూడెం కార్పొరేషన్ లో 22 స్థానాలు, కల్లూరు, సత్తుపల్లి మున్సిపాలిటీల్లో వరుసగా 12, 17 వార్డులు హస్తం ఖాతాలోకి వెళ్లారు. అటు ఇల్లందు, అశ్వరావుపేటలోనూ 19, 17 వార్డుల్లో గెలిపించి.. తన పవర్ ఏంటో పొంగులేటి చూపించారు.

Advertisement

ఓరుగల్లు కోటపై హస్తం జైత్రయాత్ర!

సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఉమ్మడి వరంగల్ జిల్లా బాధ్యతలను స్వీకరించిన పొంగులేటి.. అక్కడ కూడా ప్రత్యర్థుల కోటలను బద్ధలు కొట్టారు. అత్యంత కీలకమైన భూపాలపల్లి మున్సిపాలిటీలో 16 వార్డులను గెలుచుకుని పట్టు సాధించారు. అలాగే పరకాలలో 13, స్టేషన్ ఘన్‌పూర్‌లో 13 స్థానాలను గెలిపించి జిల్లాలో కాంగ్రెస్ ప్రాభవాన్ని చాటారు.

Advertisement

Also Read: Municipal Elections: మున్సిపల్ సమరంలో కాంగ్రెస్ సునామీ.. 1,537 వార్డులతో హస్తం హవా.. కకావికలమైన కారు!

174 స్థానాల్లో విజయం!

మొత్తంగా మంత్రి పొంగులేటి ప్రచారం నిర్వహించిన 249 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ 174 స్థానాలను గెలుచుకుంది. అంటే సుమారు 70 శాతం గెలుపు రేటుతో ఆయన ‘మోస్ట్ సక్సెస్‌ఫుల్’ లీడర్‌గా నిలిచారు. పగలు రేయి ఏకంచేసి ఆయన సాగించిన సుడిగాలి పర్యటనలు, సీఎం రేవంత్ రెడ్డి సంక్షేమ పథకాలపై ప్రజలకు కల్పించిన భరోసా ఓట్ల వర్షంగా కురిసింది.

Also Read: Viral Video: పెళ్లి వేదికపైకి.. స్టైల్‌గా వచ్చి సైలెంట్‌గా.. వధువు బ్యాగ్ కొట్టేసిన దొంగ

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×