E-Paper
Advertisement

Gaddam Vivek: మీకు పబ్లిసిటీ పిచ్చిపట్టిందా.. కేటీఆర్, హరీష్ రావు పై మంత్రి వివేక్ షాకింగ్ కామెంట్స్!

Gaddam Vivek: మీకు పబ్లిసిటీ పిచ్చిపట్టిందా.. కేటీఆర్, హరీష్ రావు పై మంత్రి వివేక్ షాకింగ్ కామెంట్స్!
Advertisement

Gaddam Vivek: కన్నెపల్లి పంప్ హౌస్ నుండి గోదావరి నీళ్లను పంపు చేయాలని కేటీఆర్ హరీష్ రావులు గగ్గోలు పెట్టడం వారి అవివేకానికి నిదర్శనమని మంత్రి గడ్డం వివేక్ అన్నారు. సోమవారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. చాలా రోజుల తర్వాత కేసీఆర్ ఫామ్ హౌస్ నుండి మనుమడి కోసం బయటకు వచ్చారన్నారు.

కెసిఆర్ ఇంజనీరా..

మా సీఎం రేవంత్ రెడ్డి చాలా సార్లు ప్రజా సమస్యల పై మాట్లాడాలని కోరాగా ప్రతి పక్ష లీడర్గా కేసీఆర్ ఏనాడు ఒక్క మాట మాట్లాడలేదన్నారు. కేటీఆర్, హరీష్ ఇద్దరు కన్నెపల్లి పంపు హౌస్ నుండి వాటర్ ని పంపు చేయాలని అంటున్నారు. పంపు చేయగలిగితే బ్యారేజ్‌లు ఎందుకు కట్టారనీ బీఆర్ఎస్‌లో ప్రశ్నించారు. కెసిఆర్ ఇంజనీర్ కాదనీ,
సెంట్రల్ కమిటీ రిపోర్ట్ ప్రకారమే బ్యారేజీలు నింపడం లేదన్నారు. కేటీఆర్, హరీష్ రావు రోజు పబ్లిసిటీ కోసం పాకులాడుతున్నారనీ ఎద్దేవా చేశారు. కవిత అడిగిన రూ.1400 కోట్లు ఎక్కడి నుండి వచ్చాయన్న దానికి వారు ప్రజలకు సమాధానం చెప్పాలనీ సూచించారు.

Advertisement

Also read: HILT Policy: హైదరాబాద్‌లో హిల్ట్ పాలసీ ఫెయిల్.. చిక్కుల్లో కాంగ్రెస్ సర్కార్..?

సిరిసిల్లలో ఇందిరమ్మ పథకం

Advertisement

కల్వకుంట్ల కుటుంబం ఆస్తులు, కమీషన్‌ల పరిపాలన జరిగిందన్నారు ఎలినేనో ప్రభావం తో వర్షాలు పడడం లేదనీ, రైతులకు ఏమి చేద్దామను ముందుకు రావాలని సూచించారు. సిరిసిల్లలో ఇందిరమ్మ పథకం ద్వారా కేటాయించిన 3500 ఇళ్లలో 2500 ఇళ్లు కట్టడం జరిగిందన్నారు. బి ఆర్ ఎస్ హాయంలో ఓట్ల కోసం డబుల్ బెడ్ రూమ్‌లు ఇస్తామని కాలం వెళ్ల దీశారనీ విమర్శించారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు పేదలకు ఇళ్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అన్నారు. ఐటీఐ ట్రైనింగ్ ఉన్నవారికి జర్మనీ టామ్ టామ్ సంస్థ ద్వారా, సిరిసిల్ల నుండి 100 మంది వరకు ఉద్యోగాలు కల్పిద్దామణి అని మంత్రి వివేక్ అన్నారు.

Also read: AP Job Calendar: ఏపీ నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. రెండోదశ జాబ్ క్యాలెండర్‌ పై సమీక్ష!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×