E-Paper
Advertisement

Bhatti Vikramarka : మీకు పొలముందా అయితే విద్యుత్ పండించండి.. అవ్వాకవుతున్నారా.. నిజం

Bhatti Vikramarka : మీకు పొలముందా అయితే విద్యుత్ పండించండి.. అవ్వాకవుతున్నారా.. నిజం
Advertisement

Bhatti Vikramarka :

⦿ రెండు మెగావాట్ల వరకు అనుమతులు
⦿ కొనుగోలు చేయనున్న ప్రభుత్వం

Advertisement

హైదరాబాద్, స్వేచ్ఛ: రాష్ట్రంలో ప్రధానమంత్రి కుసుమ్ కాంపోనెంట్ – ఏ పథకం ద్వారా రైతుల పొలాల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ఆదేశాలు జారీ చేసినట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. మంగళవారం ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్తాన్ మహాభియాన్ (పీఎం – కుసుమ్) కార్యక్రమం ద్వారా రైతుల పొలాల్లో సోలార్ విద్యుత్‌ను ఉత్పత్తి చేసి వారికి అదనపు ఆదాయ మార్గాలను సృష్టించడం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు.

ఈ పథకం కింద 0.5 మెగావాట్ల నుండి రెండు మెగావాట్ల వరకు సామర్థ్యం గల సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఎండిపోయిన లేదా పాడుబడిన వ్యవసాయ భూములపై ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఈ విధంగా కాలుష్య రహిత విద్యుత్ ఉత్పత్తిని చేయడంతో పాటు రైతులకు అదనపు ఆదాయాన్ని సమకూర్చే ప్రయత్నం చేస్తున్నట్లు వివరించారు. రైతులు తమ భూమిని సోలార్ విద్యుత్ ప్లాంట్ అభివృద్ధి కోసం డెవలపర్లకు లీజుకు ఇచ్చుకోవచ్చు. ఈ సందర్భంలో భూమి యజమానికి డెవలపర్లకు మధ్య డిస్కమ్‌ల ద్వారా ఒప్పందం మేరకు లీజు మొత్తం అందించబడుతుందని తెలిపారు.

Advertisement

Also Read : ఇందిరమ్మ ఇళ్లు వీరికే ముందు.. మున్నేరు బాధితులకు మంత్రి గుడ్ న్యూస్.. ఖమ్మానికి వరాల జల్లు

రైతులు, రైతు బృందాలు, సహకార సంఘాలు, పంచాయతీలు, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజర్లు, వాటర్ యూజర్ అసోసియేషన్లు సైతం ఈ పథకం కింద దరఖాస్తు చేయవచ్చు అని స్పష్టం చేశారు. ఈ పథకం కోసం దరఖాస్తులు టీజీఆర్‌ఈడీసీవో ద్వారా ఆన్ లైన్‌లో సమర్పించాలని, లిస్టులో పేర్కొన్న సమీప సబ్ స్టేషన్‌ను ఎంపిక చేసుకొని అక్కడ సోలార్ విద్యుత్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు. డిస్కం ఉత్పత్తి చేసిన సోలార్ విద్యుత్తును రూ.3.13/కిలో వాట్ గంట(కేడబ్ల్యూహెచ్) ధర వద్ద 25 సంవత్సరాల పాటు కొనుగోలు చేస్తుందని చెప్పారు భట్టి విక్రమార్క.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×