E-Paper
Advertisement

MHSRB: ల్యాబ్ టెక్నీషియన్ల నియామకం పూర్తిగా పారదర్శకం.. MHSRB కార్యదర్శి స్పష్టత

MHSRB: ల్యాబ్ టెక్నీషియన్ల నియామకం పూర్తిగా పారదర్శకం.. MHSRB కార్యదర్శి స్పష్టత
Advertisement

రాష్ట్రంలో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ ప్రక్రియకు సంబంధించి ఇటీవల నమస్తే తెలంగాణ పత్రికలో ప్రచురితమైన కథనం పూర్తిగా అవాస్తవమని మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (MHSRB) కార్యదర్శి ఒక ప్రకటనలో ఖండించారు. అభ్యర్థుల ఎంపికలో ఎలాంటి అక్రమాలకు తావులేదని.. నిబంధనల ప్రకారమే నియామక ప్రక్రియ కొనసాగుతోందని ఆయన స్పష్టం చేశారు.

జీవో 59 ప్రకారమే వెయిటేజీ

Advertisement

ఉద్యోగాల భర్తీలో అనుభవానికి సంబంధించి ఎవరికి వెయిటేజీ మార్కులు ఇవ్వాలనే అంశంపై 2022లోనే అప్పటి ప్రభుత్వం జీవో 59ని జారీ చేసిందని కార్యదర్శి గుర్తుచేశారు. ప్రస్తుతం చేపట్టిన ల్యాబ్ టెక్నీషియన్ల భర్తీలోనూ అదే జీవోలో పేర్కొన్న నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తున్నామని.. అర్హులైన వారికే వెయిటేజీ మార్కులను కలుపుతున్నామని వివరించారు. కొత్తగా నిబంధనల్లో ఎలాంటి మార్పులు చేయలేదని, గడిచిన రెండేళ్లుగా ఇదే విధానంలో నియామకాలు చేపడుతున్నామని ఆయన స్పష్టం చేశారు.

10,850 పోస్టుల భర్తీ పూర్తి

Advertisement

2022 నుంచి అమల్లో ఉన్న ఈ నిబంధనల ప్రకారమే ఇప్పటి వరకు వివిధ విభాగాల్లో 10,850 పోస్టులను విజయవంతంగా భర్తీ చేశామని బోర్డు వెల్లడించింది. ఎంపిక ప్రక్రియ అత్యంత పారదర్శకంగా సాగుతోందని.. ప్రతి దశలోనూ అభ్యర్థుల నుంచి వచ్చే అభ్యంతరాలను స్వీకరిస్తున్నామని పేర్కొన్నారు. అభ్యంతరాలు తెలియజేయడానికి అభ్యర్థులకు తగిన సమయం ఇస్తున్నామని, వచ్చిన ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి, సరైన క్లారిటీ ఇచ్చిన తర్వాతే తదుపరి దశకు వెళ్తున్నామని కార్యదర్శి వివరించారు.

అవాస్తవాలు నమ్మవద్దు

నియామక ప్రక్రియపై అపోహలు సృష్టించేలా వస్తున్న వార్తలను అభ్యర్థులు నమ్మవద్దని బోర్డు కోరింది. నిబంధనలకు లోబడే మెరిట్ జాబితా రూపొందిస్తున్నామని, అర్హత గల అభ్యర్థులకు ఎలాంటి అన్యాయం జరగదని హామీ ఇచ్చారు. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ.. ఎక్కడా వివాదాలకు తావులేకుండా ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని MHSRB కార్యదర్శి స్పష్టం చేశారు.

ALSO READ: CM Chandrababu: సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్.. నోబెల్ సాధిస్తే రూ. 100 కోట్లు ఫ్రీ

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×