E-Paper
Advertisement

కేటీఆర్‌కు బర్త్‌డే కానుకగా సన్నబియ్యం.. మెట్టు సాయి కుమార్ సంచలన వ్యాఖ్యలు

కేటీఆర్‌కు బర్త్‌డే కానుకగా సన్నబియ్యం.. మెట్టు సాయి కుమార్ సంచలన వ్యాఖ్యలు
Advertisement

Mettu Sai Kumar: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాణ్యమైన సన్నబియ్యం పథకంపై ఫిషరీస్ కార్పొరేషన్ ఛైర్మన్ మెట్టు సాయి కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం పేదల ఆకలి తీర్చడమే కాకుండా, వారికి పౌష్టికాహారాన్ని అందించాలనే లక్ష్యంతో నాణ్యమైన సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తోందని ఆయన చెప్పారు.

కేటీఆర్‌కు వినూత్న పుట్టినరోజు కానుక

Advertisement

ఈ పథకం విశిష్టతను ప్రతిపక్షాలకు తెలియజెప్పేందుకు ఒక వినూత్న నిర్ణయం తీసుకున్నట్లు మెట్టు సాయి కుమార్ తెలిపారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని, ఆయనకు బర్త్‌డే కానుకగా ప్రభుత్వ ఉచిత సన్న బియ్యాన్ని పంపుతున్నామని వెల్లడించారు. గత ప్రభుత్వం దొడ్డు బియ్యంతో పేదలను ఇబ్బంది పెడితే, తమ కాంగ్రెస్ ప్రభుత్వం నాణ్యమైన సన్న బియ్యం ఇస్తోందని చూపించడానికే ఈ కానుక అని పేర్కొన్నారు.

ప్రతి పేద కుటుంబానికి కొండంత అభయం

Advertisement

ప్రజా ప్రభుత్వం ఎప్పుడూ పేదల సంక్షేమానికే ప్రథమ ప్రాధాన్యం ఇస్తుందని సాయి కుమార్ స్పష్టం చేశారు. ఈ పంపిణీ కార్యక్రమం తాత్కాలికం కాదని, అర్హత కలిగిన ప్రతి పేద కుటుంబానికి నెలకు 25 కిలోల సన్న బియ్యం క్రమం తప్పకుండా అందించే పూర్తి బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుందని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు.

Also Read: సీఎం గుడ్ న్యూస్.. ORR లోపలే ఇందిరమ్మ ఇళ్లు.. ఇక నగరం దాటి పోనక్కర్లేదు..!

గత పాలకులు కేవలం మాటలకే పరిమితమైతే, రేవంత్ రెడ్డి సర్కార్ చేతల్లో సంక్షేమాన్ని చూపిస్తోందని సాయి కుమార్ వ్యాఖ్యానించారు. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న ఇలాంటి మార్పులను ప్రతిపక్ష నాయకులు కూడా ఆహ్వానించాలని ఆయన సూచించారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×