E-Paper
Advertisement

Medaram Special: మేడారం జాతరలో ‘ఇప్పపువ్వు’ ఘుమఘుమలు.. భక్తులను మురిపిస్తున్న ఆరోగ్యకరమైన లడ్డు!

Medaram Special: మేడారం జాతరలో ‘ఇప్పపువ్వు’ ఘుమఘుమలు.. భక్తులను మురిపిస్తున్న ఆరోగ్యకరమైన లడ్డు!
Advertisement

Medaram Special: ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతర తెలంగాణ కుంభమేళా గా పేరు ప్రఖ్యాతలు కీర్తి ప్రతిష్ట పొందిన మేడారం మహా జాతరలో మొట్టమొదటిసారిగా ప్రత్యేకంగా గిరిజన మహిళ సంఘం సభ్యుల ఆధ్వర్యంలో తయారుచేసిన అత్యంత పోషకాలు కలిగిన ఇప్పపువ్వు లడ్డు మేడారం వచ్చే భక్తులకు అందుబాటులో ఉంది.

అధిక ప్రయోజనాలు

Advertisement

ఇప్పపువ్వు లడ్డు తినడం ద్వారా అధిక ప్రయోజనాలు చేకూరుతాయని నిపుణులు చెప్తున్నారు.జీర్ణ క్రియ మెరుగుపడడం రోగ నిరోధక శక్తిని పెంచడం గుండె కొలెస్ట్రాల్ తగ్గించడం అధిక శక్తిని పొందడం బరువు నియంత్రణ తో పాటు డయాబెటిస్ తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్తున్నారు పూర్వకాలంలో ఆదివాసి గిరిజనులు ఇప్పపువ్వును అనేక వ్యాధులకు ముందుగా ఉపయోగించేవారు అని ఇప్పటికీ గుత్తి కోయ గూడాలలో వారి పిల్లలకు ఇప్పపువ్వు కుడుములు లడ్డూలు తినిపియడం ద్వారా పిల్లలు పౌష్టికంగా బలంగా ఉంటారని గిరిజనులు చెప్తున్నారు.

గర్భిణీ స్త్రీలకు ఎంతో మేలు

Advertisement

గర్భిణీ స్త్రీలు ఇప్పప్పు లడ్డు తినడం ద్వారా ఎంతో మేలు జరుగుతుందని కూడా చెప్తున్నారు. ఇందులో ఉండే ఫైబర్ విటమిన్లు ఖనిజాలు పోషకాలు గర్భిణీ స్త్రీలకు ఎంతగానో మేలు చేస్తుందని పుట్టబోయే బిడ్డ ఆరోగ్యకరంగా జన్మిస్తారని చెప్తున్నారు.

గిరిజన మహిళలకు ఆర్థిక భరోసా

గిరిజన మహిళలకు ఆర్థిక భరోసా అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుంది దానిలో భాగంగానే ఇప్పపువ్వు లడ్డు తయారీ ద్వారా గిరిజన మహిళలకు ఆర్థిక భరోసా లభిస్తుంది. తెలంగాణ సమగ్ర జీవనోపాధి కార్యక్రమం ద్వారా గ్రామీణ పేదరిక నిర్మూలన సంఘం ద్వారా 12 మంది గిరిజన మహిళలతో ప్రత్యేకంగా సమ్మక్క సారలమ్మ మహిళ రైతు ఉత్పత్తుల సంఘం ఏర్పాటుచేసి వీరికి రాష్ట్ర గవర్నర్ దత్తత గ్రామం కొండపర్తి గ్రామంలో ఉట్నూర్ ఐటిడిఏ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం ఇప్పపువ్వు లడ్డు తయారీ మరియు క్రయ విక్రయాల గురించి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి శిక్షణ అందించారు.

ములుగు జిల్లా తాడ్వాయి మండలం కొండపర్తి గ్రామంలో ఇప్పపువ్వు లడ్డు తయారీ యూనిట్ ను ప్రారంభించడం జరిగింది. ఈసం మంగవేణి, ఇర్ప మంజుల , ఇర్ప మౌనిక,ఈసం సాంబలక్ష్మి, ఈసం వరలక్ష్మి వీరి ఆధ్వర్యంలో సమ్మక్క సారలమ్మ మహిళ రైతు ఉత్పత్తుల సంఘం ఏర్పాటు చేసి ఎంఎస్ఎమ్ఈ లో రిజిస్ట్రేషన్ చేసి ప్రత్యేకంగా ఫుడ్ లైసెన్స్ కూడా తీసుకోవడం జరిగింది. కన్నేపల్లి గ్రామం నుంచి చెరుప నాగమణి, గొండి అనురాధ, గొండి మాణిక్యం, గొండి స్వరూప వీరి ఆధ్వర్యంలో సార్ వాళ్ళ అమ్మ ఫుడ్ ప్రొడక్ట్స్ కూడా ఫుడ్ లైసెన్స్ పొందడం జరిగింది.

మేడారం మహా జాతర వేదికగా జనవరి 13వ తేదీన ఇప్పపువ్వు లడ్డు స్టాల్స్ లను స్థానిక మంత్రి దనసరి అనసూయ సీతక్క ప్రారంభించింది. ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు సుమారుగా 3 లక్షల రూపాయల వ్యాపారం జరిగిందని నిర్వాహకులు చెప్తున్నారు. ప్రారంభించిన నాటి నుంచి భక్తుల నుంచి ఇప్ప పువ్వు లడ్డుకు మంచి ఆదరణ లభించడంతోపాటు మార్కెట్లో మంచి డిమాండ్ కూడా నెలకొంది.

ఈనెల 18వ తేదీన జరిగిన మంత్రుల క్యాబినెట్ సమావేశంలో ఇప్పపువ్వు లడ్డులను *గౌరవనీయులు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఇతర మంత్రులతో పాటు అధికారులకు పంపిణీ చేశారు. మేడారం వచ్చే భక్తులకు జాతర పరిసరాలలో పది స్టాల్స్ ఏర్పాటు చేశామని ఒక బాక్స్ లో 250 గ్రాములతో 150 రూపాయలకు అందుబాటులో ఉంటుందని , మాకు సహకరిస్తున్న స్థానిక మంత్రి అనసూయ సీతక్క గారికి, జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ గారికి, డి ఆర్ డి ఏ అధికారులకు నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.

ఇప్పపువ్వు లడ్డు ద్వారా ఎన్నో ప్రయోజనాలు చేకూరుతున్నాయని లడ్డు రుచి కూడా అమోఘంగా ఉందని గర్భిణీ స్త్రీలు ఎంతగానో ఉపయోగిస్తున్నారని కొనుగోలుదారులు చెప్తున్నారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×