E-Paper
Advertisement

Medaram Jatara: ముక్కులు చెల్లించే ఉత్సాహం.. ఐదుగురు భక్తుల ప్రాణాల మీదకు తెచ్చిన వైనం

Medaram Jatara: ముక్కులు చెల్లించే ఉత్సాహం.. ఐదుగురు భక్తుల ప్రాణాల మీదకు తెచ్చిన వైనం
Advertisement

Medaram Jatara: ములుగు జిల్లాలోని మేడారం సమ్మక్క- సారలమ్మ జాతర భక్తజన సంద్రమైంది. బుధవారం కావడంతో అమ్మవార్లను దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. అయితే.. భక్తల రద్దీ ఎక్కవగా ఉన్న సమయంలో కొందరు చేసిన అనాలోచిత పనుల వల్ల ప్రమాదం చోటుచేసుకుంది.

సమ్మక్క గద్దె వద్దకు చేరుకున్న కొందరు భక్తులు ఉత్సాహంతో తమ మెుక్కులు  చెల్లించుకునే క్రమంలో  కొబ్బరికాయలను గద్దెలపైకి విసిరారు. ఈ క్రమంలో అవి ఇతర భక్తులకు తగలడంతో ఏకంగా ఐదుగురు భక్తులు గాయపడ్డారు. ఈ ఊహించని పరిణామంతో అక్కడ ఒక్కసారిగా కలకలం రేగింది. వెంటనే అప్రమత్తమైన రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని.. బాధితులకు అవసరమైన ప్రథమ చికిత్సను అందించాయి. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు ఆలయ కమిటీ తెలిపారు.

Advertisement

ఈ ఘటనపై ఆలయ కమిటీ, పోలీసులు తీవ్రంగా స్పందించారు. భక్తుల రక్షణ దృష్ట్యా గద్దెలపైకి బెల్లం, కొబ్బరికాయలు విసరడం నిషిద్ధమని స్పష్టం చేశారు. ఇా విసరడం వల్ల తోపులాటలు జరగడమే కాకుండా.. ఎదురుగా ఉన్న భక్తులకు తలలకు తగిలి ప్రాణాపాయం కలిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. మెుక్కులు చెల్లించుకునే వారు క్రమశిక్షణతో ఉండాలని.. అధికారులకు సహకరించాలని కమిటీ కోరింది.

మేడాం జాతరలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రభుత్వం భారీ భద్రతను ఏర్పాటు  చేసినప్పటికీ.. భక్తులు క్రమశిక్షణ పాటించినప్పుడే జాతర విజయవంతమవుతుందని అధికారులు గుర్తు చేస్తున్నారు.

Advertisement

ALSO READ: వన్ చైల్డ్ నుంచి నో చైల్డ్ దాకా.. చైనా యువత ఎందుకు వెనకడుగు వేస్తోంది?

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×