E-Paper
Advertisement

Medaram Jatara 2026: లక్షలాది భక్తులకు భరోసా.. మేడారంలో 50 పడకల సూపర్ స్పెషాలిటీ సేవలు

Medaram Jatara 2026: లక్షలాది భక్తులకు భరోసా.. మేడారంలో 50 పడకల సూపర్ స్పెషాలిటీ సేవలు
Advertisement

Medaram Jatara 2026:  మేడారం జాతరకు వచ్చే లక్షలాది భక్తుల ఆరోగ్య రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లను చేపట్టింది. ఒకవైపు సురక్షిత మంచినీటిని అందించడం, ముమ్మర పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టడం, జంపన్న వాగులో నీరు కలుషితం కాకుండా చర్యలుచేపట్టడంతో పాటు పెద్ద ఎత్తున వైద్య సదుపాయాలను కల్పించింది.

మేడారం జాతర ప్రధాన వేదిక సమీపంలో టిటిడి కల్యాణ మండపంలో 50 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేయడం, 30 ప్రాంతాల్లో ప్రత్యేకంగా మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేశారు. మోత్తం జాతరలో ఏవిధమైన ఇబ్బందులు కలుగకండా ఉండేందుకు 5192 మంది మెడికల్, పారా మెడికల్ సిబ్బందిని వైద్యఆరోగ్యశాఖ రంగంలోకి దించింది. జాతర సమయంలో 24 గంటలు వైద్య సేవలందించేందుకు గాను 649 వైద్యాధికారులు, 154 మంది ఆయుష్ వైద్యాధికారులు, 673 నర్సింగ్ అధికారులు, 1905 ఆశ వర్కర్లు, 1111 పారామెడికల్ సిబ్బంది, 331 సూపర్వైజరి స్టాఫ్, 700 ఇతర సిబ్బందిని ప్రత్యేకంగా నియమించారు.

Advertisement

ALSO READ: మేడారం జాతరలో ‘ఇప్పపువ్వు’ ఘుమఘుమలు.. భక్తులను మురిపిస్తున్న ఆరోగ్యకరమైన లడ్డు!
జాతర ముగిసిన అనంతరం కూడా స్థానిక గిరిజనులకు ఏవిధమైన ఆరోగ్య సమస్యలు కలుగకుండా 10 మెడికల్ క్యాంప్స్ నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. వీటితోపాటు, మేడారం చుట్టూ పక్కలా ఉన్న ఏటూరు నాగారం, ములుగు, పస్రా, గోవిందా రావు పేట, మంగపేట సి.ఎస్.సి. ఆసుపత్రులను పటిష్ఠపరిచారు.

మేడారం వచ్చే బీభక్తులు విధిగా జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఈ జంపన్న వాగులో ప్రమాద వశాత్తూ పడి ప్రమాదాలకు గురు కాకుండా ఉండేందుకు జంపన్న వాగు పొడుగునా సురక్షితులైన స్విమ్మర్లు, సింగరేణి, ఎస్.డి.ఆర్.ఎఫ్ సిబ్బందిని మొత్తం 325 మందిని నియమించారు. వీరిలో మత్శ్య శాఖ ద్వారా 210 స్విమ్మర్లు, 12 మంది సింగరేణి రెస్క్యూ టీమ్ సభ్యులు, 100 మంది ఎస్.డీ.ఆర్.ఎఫ్ టీమ్ సభ్యులున్నారు.వీరందరికీ లైఫ్ జాకెట్లు, ప్రత్యేక టీ షర్ట్స్, సెర్చ్ లైట్స్, లైఫ్ సేవింగ్ పరికరాలు అందచేశారు.

Advertisement

జాతర మొత్తం ప్రాంగణంలో ఏవిధమైన అగ్నిప్రమాదాలు జరుగకుండా రాష్ట్ర అగ్నిమాపక శాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది. 15 ఫైర్ బ్రిగేడ్స్, 12 మిస్ట్ బుల్లెట్స్, రెండు ఫైర్ ఇంజన్లను జాతర ప్రాంగణంలో మోహరించారు. మొత్తం 268 ఫైర్ సిబ్బంది విధుల్లో ఉంటారు.

ALSO READ:పంజాగుట్టలో డ్రగ్స్ కలకలం.. ఐదుగురు విద్యార్థులు అరెస్ట్!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×