E-Paper
Advertisement

Mynampally Rohith Rao: రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు అండగా ఉంటా : మైనంపల్లి రోహిత్ రావు

Mynampally Rohith Rao: రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు అండగా ఉంటా :  మైనంపల్లి రోహిత్ రావు
Advertisement

Mynampally Rohith Rao: కోల్చారం మండలం రాంపూర్ గ్రామ శివారులో జాతీయ రహదారి పై రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు అండగా ఉంటానని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. ఆదివారం రాంపూర్ సమీపంలోని జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మండలంలోని బూరుగుపల్లి గ్రామానికి చెందిన కలాలి అమృత గౌడ్, రిషి వర్ధన్ గౌడ్,బి.భూపతిపూర్ గ్రామానికి చెందిన గోకని సాయ గౌడ్ మృతి చెందిన విషయం తెలిసిందే.మెదక్ ఎమ్మెల్యే ఆదివారం వారి ఇద్దరి పిల్లలకు ఒక్కొక్కరికి రూ 25 వేల చొప్పున ఇద్దరికి రూ 50 వేల ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. డాక్టర్ మైనంపల్లి రోహిత్ మెదక్ ఎమ్మెల్యే ఈ ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆదివారం రెండు కుటుంబాలను పరామర్శించారు.

Also Read: Samuel Controversy: బండి సంజయ్‌కు ఊహించని షాక్.. ఎమ్మెల్యే సామెల్ సంచలన సవాల్!

కుటింబికులను పరామర్శించి ధైర్యంగా ఉండాలి 

Advertisement

భూపతిపూర్ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం అంతిమయాత్ర లో పాల్గొని పాడే మోశారు. వారి కుటింబికులను పరామర్శించి ధైర్యంగా ఉండాలని సూచించారు.కుటుంబ సభ్యుల బాధను చూసి కూడా భావోద్వేగానికి ఆయన గురయ్యారు.రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం అత్యంత బాధాకరమని అన్నారు.రెండు గ్రామాల మృతదేహాల అంత్యక్రియల ఖర్చులను మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు భరిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పరశురాం గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్, సర్పంచ్ సాయిలు, మండల పార్టీ నాయకులు మహేందర్ రెడ్డి, బాలకిషన్ రావ్, సాయి బాబా, తదితరులు పాల్గొన్నారు.

Also Read: Animal Language: మనుషులకే కాదు.. ఈ జంతువులకూ ఉన్నాయి కమ్యూనికేషన్ స్కిల్స్!

Advertisement

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించడం చాలా బాధాకరం : పద్మదేవేందర్ రెడ్డి

మెదక్ జిల్లా రాంపూర్ జాతీయ రహదారిపై (శనివారం) జరిగిన రోడ్డు ప్రమాదంలో హవేలీఘనపూర్ మండలం బూరుగుపల్లి గ్రామానికి చెందిన తండ్రి–కుమారుడు అమృత్ గౌడ్, రిషి వర్ధన్ గౌడ్, అలాగే వారి అల్లుడు సాయ్ గౌడ్ మృతి చెందడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.ఈ విషయం తెలుసుకున్న మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు యం. పద్మదేవేందర్ రెడ్డి ఆదివారం బూరుగుపల్లి గ్రామానికి చేరుకుని అమృత్ గౌడ్, రిషి వర్ధన్ గౌడ్ పార్థివ దేహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి

అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు.ఈ సందర్భంగా పద్మదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఒకే ప్రమాదంలో తండ్రి, కుమారుడు, అల్లుడు ప్రాణాలు కోల్పోవడం చాలా దురదృష్టకరమని అన్నారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొంటూ బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వీరివెంట బూరుగుపల్లి మాజీ సర్పంచ్ చెన్న గౌడ్,హవెలిఘనపూర్ సర్పంచ్ సాయిలు, నాయకులు బాలరాజ్, రవీందర్ గౌడ్,సాప.సాయిలు, రాంచంద్రం రెడ్డి, గ్రామ ప్రజలు తదితరులు ఉన్నారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×