E-Paper
Advertisement

మెదక్‌లో సినిమా స్టైల్ కిడ్నాప్.. నాలుగు కార్లలో వచ్చి నవవధువును ఎత్తుకెళ్లిన బంధువులు!

మెదక్‌లో సినిమా స్టైల్ కిడ్నాప్.. నాలుగు కార్లలో వచ్చి నవవధువును ఎత్తుకెళ్లిన బంధువులు!
Advertisement

Bride Kidnapped: సినిమా తెరపై చూసే విస్తుపోయే దృశ్యాలు నిజ జీవితంలో ఎదురైతే? అది కూడా నడిరోడ్డుపై, పదిమంది చూస్తుండగానే జరిగితే? మెదక్ జిల్లాలో సరిగ్గా అలాంటి ఘటనే ఒకటి వెలుగుచూసింది. కులాంతర వివాహం చేసుకుందనే కోపంతో, కన్నకూతురిని కారులో సినిమా సీన్‌ను తలపించేలా కిడ్నాప్ చేశారు ఆమె కుటుంబ సభ్యులు.

ప్రేమ వివాహం.. పోలీస్ స్టేషన్ కౌన్సిలింగ్

Advertisement

మెదక్ జిల్లా ఎల్లాపూర్ గ్రామానికి చెందిన ప్రణయ్ అనే యువకుడు, అదే ప్రాంతానికి చెందిన ఒక యువతి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరిది వేర్వేరు కులాలు కావడంతో అమ్మాయి ఇంట్లో పెళ్లికి నిరాకరించారు. దీంతో ఈ నెల 6న పెద్దలను ఎదిరించి ఈ జంట ప్రేమ వివాహం చేసుకుంది. రక్షణ కోరుతూ వారు పోలీసులను ఆశ్రయించగా, పోలీస్ స్టేషన్‌లో ఇరువర్గాలకు కౌన్సిలింగ్ కూడా నిర్వహించారు.

Also Read: రన్నింగ్ ఫ్లైట్ నుంచి దూకి ఇన్‌స్ట్రక్టర్ ఆత్మహత్య.. ఆ తర్వాత ఆకాశంలో ఏం జరిగింది?

Advertisement

నాలుగు కార్లలో వచ్చి.. బీభత్సం సృష్టించి!

పోలీస్ స్టేషన్‌లో కౌన్సిలింగ్ ముగిసి, అంతా సర్దుకుందని భావిస్తున్న సమయంలో వధువు బంధువులు దారుణానికి ఒడిగట్టారు. ప్రణయ్ ఇంటిపై నాలుగు కార్లలో ఒక్కసారిగా దాడి చేశారు. లాఠీలు, ఆయుధాలతో వచ్చి అడ్డువచ్చిన వారిని బెదిరించారు. ఇంట్లోకి చొరబడి నూతన వధువును బలవంతంగా కారులోకి నెట్టి, అక్కడి నుంచి సినిమా స్టైల్లో పరారయ్యారు.

పోలీసుల అలసత్వంపై వరుడి ఆవేదన

కౌన్సిలింగ్ ముగిసిన రోజే ఇంతటి ఘోరం జరగడం స్థానికంగా కలకలం రేపింది. అయితే ఈ ఘటనపై తాము ఫిర్యాదు చేసినా పోలీసులు సకాలంలో స్పందించడం లేదని, కనీసం పట్టించుకోవడం లేదని వరుడి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన భార్య ప్రాణాలకు ముప్పు ఉందని, ఆమెను ఎలాగైనా కాపాడాలంటూ ప్రణయ్ కన్నీరుమున్నీరవుతున్నాడు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×