E-Paper
Advertisement

ఇక నైనా రైతులు మేల్కోనక పోతే సర్వ వినాశనమే: ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్!

ఇక నైనా రైతులు మేల్కోనక పోతే సర్వ వినాశనమే: ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్!
Advertisement

Oil Palm: స్వేచ్ఛ బ్యూరో: 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా మంగళవారం మెదక్ జిల్లా కేంద్రంలోని మాయ గార్డెన్ లో ఉద్యానవన శాఖ అధికారి ప్రతాప్ సింగ్, అధ్యక్షతన నిర్వహించిన ఉద్యానవన పంటల సాగు, ఆయిల్ ఫామ్ సాగు విస్తీర్ణం పెరుగుదల, ప్రత్యామ్నాయ పంటల సాగు పై అవగాహన సదస్సు కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, మున్సిపల్ చైర్మన్ రాధిక భూపతి రాజు, వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్ , వివిధ ప్రజాప్రతినిధులు అధికారులు రైతులతో కలిసి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ,రాష్ట్ర గేయాలపనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.

భవిష్యత్తులో భూమి మొత్తం..

ఈ సందర్బంగా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా రైతులను అన్ని విధాల ఆదుకుంటుందని అన్ని రకాల సబ్సిడీలు ఆర్థిక, ఆధునిక సాంకేతిక రంగంలో నూతన పద్ధతుల ద్వారా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పరిచే దిశగా రైతులకు మేలు చేసే విధంగా
అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది అన్నారు. రైతులు ప్రయత్నం చేయక పొతే భవిష్యత్తులో భూమి మొత్తం నిస్థార మవుతుందని,తక్కువ పెట్టుబడి తో ఎక్కువ పంటలు పండించేలా రైతులు ముందుకెళ్లాలని, ఆర్గానిక్ పంటల సాగు పై రైతులు ద్రుష్టి పెట్టాలన్నారు. భూములను రక్షించి ప్రకృతి వ్యవసాయం చేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు ఆరోగ్య పరిరక్షణ, సమతుల్య ఎరువుల యాజమాన్యం, ప్రకృతి వ్యవసాయం, పై అవగాహనా కలిపించు కోవాలన్నారు.

ఆయిల్ ఫామ్ పంటలో..

Advertisement

జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ… ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాల్లో భాగంగా రైతు వారోత్సవాల కార్యక్రమాలను జిల్లాలో ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. రైతులు భూసార పరీక్షలు చేయించుకోవాలని, ఓకే పంట కాకుండా పంటల మార్పిడి చేయాలన్నారు. ఒకే పంటతో జరిగిన నష్టాన్ని అధికారులు రైతులకు వివరించాలన్నారు. పండ్లు కూరగాయలు పూలులతో ఆయిల్ పామ్ పంటలను కూడా పండించడం ద్వారా అధిక లాభాలను అర్జించవచ్చని తెలిపారు. ఆయిల్ ఫామ్ పంటలో ఇతర పంటలను కూడా పండించవచ్చని, కోతుల బెడద నుండి పంటలను కాపాడడానికి ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.

Also Read: మిత్ర‌ధ‌ర్మం పాటించి.. విజ‌య్ ఆఫ‌ర్ కాద‌ని! త‌మిళ‌నాడు కాంగ్రెస్‌లో చ‌ర్చ‌…!

అంతర్ పంటలు..

Advertisement

మున్సిపల్ చైర్మన్ రాధిక భూపతి రాజు మాట్లాడుతూ రైతుల బాగు కోరి ఆయిల్ ఫామ్ పంటను రాష్ట్ర ప్రభుత్వం పరిచయం చేసిందన్నారు ఈ పరిచయం దినదినాభివృద్ధి చెందుతూ. మన జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగు చేసేందుకు రైతులు మొగ్గుచూపుతున్నారు అన్నారు. రైతులు ప్రస్తుతం ఉన్న పంటలే కాకుండా ప్రత్యామ్నాయ పంటలపై మొగ్గు చూపుతూ అభివృద్ధి దిశగా ముందుకు పోవాలన్నారు అంతర్ పంటలు వేస్తూ ఆయిల్ ఫామ్ సాగు చేస్తే లాభాలు బేశరతుగా ఉంటాయని ఈ సందర్భంగా వెల్లడించారు.

ఇతర పంటలపై..

మెదక్ మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్ మాట్లాడుతూ రైతే దేశానికి వెన్నుముక అనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని ప్రత్యామ్నాయ ఇతర పంటలపై రైతులు మొగ్గు చూపుతూ సాగు చేస్తూ అధిక లాభాలు ఆర్జించాలని తెలిపారు. అంతకుముందు శాఖ ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్, ఉద్యానవన శాఖ అధికారి ప్రతాప్ సింగ్, కౌన్సిలర్లూ తదితరులు పాల్గొన్నారు.

Also Read: రవాణా శాఖలో స్మార్ట్ కార్డుల మాయాజాలం.. అక్కడ లంచం ఇస్తేనే లైసెన్స్..!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×