E-Paper
Advertisement

Hyderabad News: పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం, తగలబడిన షాపులు, నష్టం భారీగా

Hyderabad News: పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం, తగలబడిన షాపులు, నష్టం భారీగా
Advertisement

Hyderabad News: హైదరాబాద్ పాతబస్తీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం దివాన్ దేవ్ డి ఏరియాలోని ఓ షాపింగ్ కాంప్లెక్స్‌లో ఒక్కసారి మంటలు ఎగిసిపడ్డాయి. అగ్నికీలలకు దాదాపు 40 టెక్స్‌టైల్‌ షాపుల్లో వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి.

ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ ఇంజన్లు రంగంలోకి దిగాయి. దాదాపు 10 ఫైర్ ఫైటర్లు మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశాయి. ఎట్టకేలకు మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమై ఉండొచ్చని ఫైర్ సేఫ్టీ అధికారి చెబుతున్నారు.

Advertisement

ఘటన నుంచి సమాచారం అందుకున్న వెంటనే ఏడు ప్రాంతాల నుంచి ఏడు ఫైర్ ఇంజిన్స్ తెప్పించామన్నారు. మంటలను దాదాపుగా అదుపులోకి వచ్చాయని తెలిపారు. రెండు, మూడు ఫ్లోర్లలో మంటలు చెలరేగాయని తెలిపారు. ప్రమాదం సమయంలో లోపలకు వెళ్లడానికి వాతావరణం అనుకూలంగా లేదన్నారు. దానివల్ల కాస్త ఆలస్యమైందని ఎట్టకేలకు మంటలను అదుపులోకి తెచ్చామన్నారు.

ఆస్తి నష్టం ఎంత ఉండవచ్చన్నది చెప్పలేమన్నారు. ఘటన చుట్టూ బట్టల షాపుల ఉండడంతో భారీగా ఉండవచ్చని కొందరు అధికారుల మాట.  ప్రమాద ఘటనలపై విచారణ జరుగుతోందన్నారు. విచారణలో ప్రమాదం ఎలా జరిగింది? అనే విషయాలపై స్పష్టత వస్తుందన్నారు.

Advertisement

ALSO READ: రంగరాజన్ దాడి కేసు, కీలక నిందితుడు అరెస్ట్, మరికొందరి కోసం గాలింపు

 

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×