E-Paper
Advertisement

Kondagattu Fire: కొండగట్టు స్టేజీ వద్ద భారీ అగ్నిప్రమాదం, మంటల్లో 30 షాపులు, భారీగా ఆస్తి నష్టం

Kondagattu Fire: కొండగట్టు స్టేజీ వద్ద భారీ అగ్నిప్రమాదం, మంటల్లో 30 షాపులు, భారీగా ఆస్తి నష్టం
Advertisement

Kondagattu Fire: జగిత్యాల జిల్లా కొండగట్టు స్టేజీ వద్ద భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా పెద్దఎత్తున మంటలు అంటుకున్నాయి.  పక్కపక్కనే ఉన్న సుమారు 30 దుకాణాలకు మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటన స్థలానికి ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది.

కొండగట్టు స్టేజీ వద్ద భారీ అగ్నిప్రమాదం

Advertisement

జగిత్యాల జిల్లా కొండగట్టు స్టేజీ వద్ద శనివారం అర్థరాత్రి సమయంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. హనుమాన్‌ విగ్రహం నుంచి కరీంనగర్‌-జగిత్యాల ప్రధాన రహదారి వరకు దాదాపు 32 షాపులు ఉన్నాయి. రకరకాల బొమ్మలంతా ఆ ప్రాంతంలో ఉన్నాయి. ఏం జరిగిందో తెలీదుగానీ తొలుత చిన్నపాటి మంట వచ్చింది. ఆ తర్వాత తీవ్రరూపం దాల్చింది.

ఈ విషయం తెలుసుకుని అక్కడికి షాపుల యజమానులు వచ్చేసరికి షాపుల్లోని సామగ్రి కాలి బూడిదైంది. స్థానిక పండగలు, సమ్మక్క సారలమ్మ జాతరను పురస్కరించుకొని భారీగా బొమ్మలు కొనుగోలు చేసి నిల్వ చేసుకున్నారు వ్యాపారులు. ఒక్కో షాపులో రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు సరుకు ఉంటుందని చెబుతున్నారు.

Advertisement

మంటల్లో 30 షాపులు, భారీగా ఆస్తి నష్టం

ఈ లెక్కన ఏలా చూసుకున్నా కోట్లలో ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. విద్యుత్తు షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఘటన వెనుక ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు.  తమను ప్రభుత్వం ఆదుకోవాలని వ్యాపారులు చెబుతున్నారు.  ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సివుంది.

ALSO READ: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. 3 వేల మెగావాట్ల సోలార్ పవర్ కొనుగోలుకు నిర్ణయం

 

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×