E-Paper
Advertisement

Mancherial: రెండు రైలు బోగీల మధ్య పడుకొని.. మంచిర్యాలలో షాకింగ్ ఘటన

Mancherial: రెండు రైలు బోగీల మధ్య పడుకొని.. మంచిర్యాలలో షాకింగ్ ఘటన
Advertisement
Mancherial: తెలంగాణలోని మంచిర్యాల రైల్వే స్టేషన్ పరిధిలో ఒక వ్యక్తి ప్రాణాలకు తెగించి ప్రయాణం చేశాడు. గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైలులో రెండు బోగీల మధ్య ఉండే ‘కప్లింగ్’ పై ప్రమాదకర రీతిలో కూర్చుని ఆ వ్యక్తి ప్రయాణించాడు. కదిలే రైలులో ఏమాత్రం పట్టుతప్పినా ప్రాణాలు గాల్లో కలిసే అవకాశం ఉన్నప్పటికీ, అవేమీ పట్టించుకోకుండా అతను చేసిన ఈ సాహసం ప్రయాణికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది.

అయితే రైలు మంచిర్యాల స్టేషన్‌కు చేరుకున్న సమయంలో, బోగీల మధ్యలో ఏదో కదలిక ఉండటాన్ని గమనించిన RPF, స్థానిక పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఏ క్షణంలోనైనా ప్రమాదం జరగవచ్చని భావించి, రైలును నిలిపివేసిన అనంతరం అతడిని సురక్షితంగా కిందికి దించారు. నిబంధనలకు విరుద్ధంగా, అత్యంత ప్రమాదకర రీతిలో ప్రయాణించినందుకు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల విచారణలో ఆ ప్రయాణికుడు వింతగా ప్రవర్తించాడు. అతను ఎక్కడి నుంచి వస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు అనే విషయాలపై పోలీసులు ప్రశ్నించగా.. పొంతన లేని సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది. అతని మాటల్లో స్పష్టత లేకపోవడంతో, అతనికి మానసిక స్థితి సరిగా లేదా లేక ఏదైనా ఇతర కారణాలతో ఇలా చేశాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం అతని చిరునామాను సేకరిస్తున్నారు.

Advertisement

Also Read: తరగని భక్తి.. చెరగని రికార్డు.. తిరుమలలో సరికొత్త చరిత్ర సృష్టించిన ప్రసాదం పంపిణీ!

ఈ ఘటనపై స్పందించిన రైల్వే అధికారులు.. ప్రయాణికులు ఇలాంటి సాహసాలు చేసి తమ ప్రాణాలను ప్రమాదంలో పడేసుకోవద్దని హెచ్చరిస్తున్నారు. రైలు లోపల కాకుండా బయట భాగాల్లో, ఫుట్‌బోర్డులపై లేదా బోగీల మధ్య ప్రయాణించడం చట్టరీత్యా నేరమని, దీనివల్ల కేవలం ఒకరి ప్రాణమే కాకుండా రైలు రాకపోకలకు కూడా అంతరాయం కలుగుతుందని గుర్తుచేశారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Advertisement

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×