E-Paper
Advertisement

Badrachalam: బ్రిడ్జిపై నుండి దూకేస్తాన‌ని యువ‌కుడు ..మాట‌ల్లో పెట్టిన స్థానికులు.. అప్పుడే బైక్ రావ‌డంతో

Badrachalam: బ్రిడ్జిపై నుండి దూకేస్తాన‌ని యువ‌కుడు ..మాట‌ల్లో పెట్టిన స్థానికులు.. అప్పుడే బైక్ రావ‌డంతో
Advertisement

జీవితంలో వ‌చ్చే చిన్న చిన్న స‌మ‌స్య‌ల‌కే కొంత‌మంది ఆత్మ‌హ‌త్య వ‌ర‌కూ వెళుతుంటారు. ఏ స‌మ‌స్య అయినా కాస్త ఆలోచిస్తే ప‌రిష్కారం అవుతుంది. కానీ అలా ఆలోచించ‌కుండా తొంద‌ర‌ప‌డి నిర్ణ‌యాలు తీసుకుని ప్రాణాలు తీసుకుంటుంటారు. అయితే భూమిపై బ్ర‌త‌కాలని రాసి పెట్టి ఉంటే ఏం జ‌రిగినా చ‌నిపోర‌ని పెద్ద‌లు చెబుతుంటారు.

అలా రాసి పెట్టి ఉంటే ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌ని ప్ర‌య‌త్నించినా ఏదో ఒక ర‌కంగా బతికి బ‌య‌ట‌ప‌డ‌తారు. తాజాగా అలాంటి ఘ‌ట‌నే ఒక‌టి భ‌ద్రాచ‌లంలో చోటు చేసుకుంది. ఓ యువ‌కుడు భ్ర‌దాచ‌లంలోని గోదావ‌రి వంతెన‌పై నుండి దూకి ఆత్మ‌హ‌త్య చేసుకునేందుకు ప్ర‌య‌త్నించాడు. అక్క‌డే ఉన్న స్థానికులు ఆ వ్య‌క్తిని కిందికి దూక‌వ‌ద్ద‌ని స‌మ‌స్య ఏంటో చెబితే తాము తీరుస్తామ‌ని న‌చ్చ‌జెప్పే ప్ర‌య‌త్నం చేశాడు.

Advertisement

అయిన‌ప్ప‌టికీ ఆ వ్య‌క్తి విన‌కుండా దూకేస్తాన‌ని ప‌ట్టుప‌ట్టి కూర్చున్నాడు. దీంతో అక్క‌డ ఉన్న‌వారు అత‌డిని మెల్లిగా మాట‌ల్లో పెట్టారు. ఆ స‌మ‌యంలో బ్రిడ్జిపై నుండి వాహ‌నాలు అటూ ఇటూ వెళుతున్నాయి. వారు మాటల్లో పెట్టిన స‌మ‌యంలోనే వెన‌కనుండి వ‌చ్చిన ఓ వ్య‌క్తి బైక్ ను నెమ్మ‌దిగా ఆపేశాడు. దూకే వ్య‌క్తి అత‌డిని గ‌మ‌నించ‌కుండా నెమ్మ‌దిగా వెన‌క నుండి వెళ్లాడు. స‌రిగ్గా దూకే స‌మ‌యంలో న‌డుం ద‌గ్గ‌ర గ‌ట్టిగా ప‌ట్టుకుని వెన‌క్కి లాగేశాడు. వెన‌క్కి లాగిన వెంట‌నే అందరూ వ‌చ్చి అత‌డిని ప‌ట్టుకున్నారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×