E-Paper
Advertisement

Gadwal Protest: న్యాయం కోసం వాటర్ ట్యాంక్ ఎక్కి యువకుడు ఆత్మహత్యాయత్నం..!

Gadwal Protest: న్యాయం కోసం వాటర్ ట్యాంక్ ఎక్కి యువకుడు ఆత్మహత్యాయత్నం..!
Advertisement

Gadwal Protest: స్వేచ్చ బ్యూరో: తన భార్యతో అక్రమ సంబంధం కొనసాసగిస్తున్న‌ ఒక ఏఅర్ హెడ్ కానిస్టేబుల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఓ వ్యక్తి గద్వాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వెనుక భాగంలో ఉన్న వాటర్ ట్యాంక్ పైకి పెట్రోల్ బాటిల్‌తో ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడం గురువారం జిల్లా కేంద్రంలో కలకలం రేపింది. తన భార్యతో అక్రమ సంబంధం కొనసాసగిస్తున్న‌ ఒక ఏఅర్ హెడ్ కానిస్టేబుల్ పై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా బాధితుడు డిమాండ్ చేశాడు. న్యాయం చేస్తామని గద్వాల సీఐ హామీ ఇవ్వడంతో బాధితుడు వాటర్ ట్యాంక్ దిగ్గడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఏఆర్ హెడ్ కానిస్టేబుల్‌తో..

బాధితుడు నరేష్ చారి కథనం ప్రకారం.. తన భార్య, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్‌తో అక్రమ సంబంధం కొనసాగిస్తోందని, దీనివల్ల తన కుటుంబ జీవితం పూర్తిగా నాశనమైందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ అక్రమ సంబంధం వ్యవహారంపై గతంలో తాను గద్వాల పట్టణ పోలీసులకు అనేకసార్లు ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని నరేష్ చారి ఆరోపించాడు.‌ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా న్యాయం జరగకపోవడం, అధికారులు పట్టించుకోకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురై, విసిగిపోయి ఈ ప్రాణాంతక నిర్ణయం తీసుకున్నట్లు బాధితుడు వెల్లడించాడు.

Advertisement

Also read: తెలంగాణ రైతులకు బంపరాఫర్.. బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకోండి

చర్యలు తీసుకుంటామని హామీ..

విషయం తెలుసుకున్న గద్వాల సీఐ టంగుటూరి శ్రీనివాస్ తక్షణమే సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. వాటర్ ట్యాంక్ పైనున్న నరేష్ చారితో ఆయన ఫోన్ ద్వారా మాట్లాడి, కౌన్సిలింగ్ ఇచ్చారు. బాధితుడికి ఖచ్చితంగా న్యాయం చేస్తామని, బాధ్యులైన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని గట్టి హామీ ఇచ్చారు.‌ గద్వాల సీఐ ఇచ్చిన నమ్మకమైన భరోసాతో శాంతించిన నరేష్ చారి ఎట్టకేలకు వాటర్ ట్యాంక్ కిందికి దిగివచ్చాడు. దీంతో గంటల తరబడి సాగిన ఉత్కంఠకు తెరపడటంతో పోలీసులు, స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు తదుపరి దర్యాప్తు జరుపుతున్నారు.

Advertisement

Also read: దేశ వ్యాప్తంగా 10 వందేభారత్ స్లీపర్ రైళ్లు.. రైల్వేశాఖ గ్రీన్ సిగ్నల్!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×