E-Paper
Advertisement

Mallareddy: రేవంత్ రెడ్డి తోపు లీడర్.. మేమిద్దరం అన్నదమ్ములం, మల్లారెడ్డి పొగడ్తలు

Mallareddy: రేవంత్ రెడ్డి తోపు లీడర్.. మేమిద్దరం అన్నదమ్ములం, మల్లారెడ్డి పొగడ్తలు
Advertisement

Mallareddy: తెలంగాణ మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. తనదైన శైలిలో మాట్లాడుతూ వార్తల్లో నిలిచే ఆయన.. ఈసారి నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తనకున్న అనుబంధం గురించి , తన సినీ రంగ ప్రవేశం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు

Advertisement

రెడ్డి సామాజిక వర్గ సమావేశంలో మాట్లాడిన మల్లారెడ్డి.. ‘రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది నేనే’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఒక రెడ్డి సంఘం మీటింగ్‌లో రెడ్డి సామాజికవర్గంలో రేవంత్ రెడ్డి మించిన పవర్‌ఫుల్ నాయకుడు మరొకరు లేరని తాను గట్టిగా చెప్పానని ఆయన గుర్తు చేసుకున్నారు. రాజకీయంగా తాము వేర్వేరు పార్టీల్లో ఉన్నప్పటికీ.. వ్యక్తిగతంగా తామిద్దరం అన్నదమ్ములమేనని స్పష్టం చేశారు. ఎవరు అవునన్నా, కాదన్నా తమ మధ్య ఉన్న బంధం అటువంటిదని ఆయన వ్యాఖ్యానించారు.

సినిమా ఆఫర్లు

Advertisement

రాజకీయాలకే పరిమితం కాకుండా.. వెండితెరపై కూడా తన ముద్ర వేయాలని మల్లారెడ్డి భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో తనకు విలన్ క్యారెక్టర్ ఆఫర్ వచ్చిందని ఆయన వెల్లడించారు. దర్శకుడు హరీష్ శంకర్ స్వయంగా అడిగినప్పటికీ.. ఆ సమయంలో తాను ‘నో’ చెప్పానని తెలిపారు. అయితే.. భవిష్యత్తులో సినిమాల్లో నటించాలనే కోరిక తనకు బలంగా ఉందని, ముఖ్యంగా తెరపై ముఖ్యమంత్రి పాత్ర చేయాలని తన మనసులో ఉందని ఆయన చెప్పుకొచ్చారు.

మల్లారెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నప్పటికీ, రేవంత్ రెడ్డి సామర్థ్యాన్ని ప్రశంసించడం , తన సినీ ఆశలను బయటపెట్టడం చర్చనీయాంశంగా మారింది.

Also Read: గంజాయి బ్యాచ్ వీరంగం.. వీపులో దిగబడిన కత్తి, ఇళ్లకు నిప్పు పెట్టే ప్రయత్నం

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×