E-Paper
Advertisement

Mallareddy : నా కొడుకుని సీఆర్‌పీఎఫ్ సిబ్బందితో కొట్టించారు… మల్లారెడ్డి ఆరోపణలు

Mallareddy : నా కొడుకుని సీఆర్‌పీఎఫ్ సిబ్బందితో కొట్టించారు… మల్లారెడ్డి ఆరోపణలు
Advertisement

Mallareddy : తెలంగాణ మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఆర్‌పీఎఫ్ దళాలతో రాత్రంతా తన కుమారుడు మహేందర్ రెడ్డిని కొట్టించారని ఆరోపించారు. అందుకే ఛాతీలో నొప్పి వచ్చినట్టుందని అన్నారు. సూరారంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పెద్ద కుమారుడు మహేందర్‌రెడ్డి పరిస్థితిపై మంత్రి ఆస్పత్రికి చేరుకుని వైద్యులతో మాట్లాడారు. ఈ సమయంలో బీజేపీపై తీవ్రస్థాయిలో మల్లారెడ్డి మండిపడ్డారు. తాను కష్టపడి సంపాదించానన్నారు. నిజాయితీగా ఉన్నానని స్పష్టం చేశారు. ఎన్నో ఏళ్లు కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నానని తెలిపారు. కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తనపై అక్రమంగా దాడులు చేస్తోందని మండిపడ్డారు. దాడులకు బెదిరేది లేదన్నారు.

మంత్రి మల్లారెడ్డి కుమారుడు మహేందర్‌రెడ్డికి హైపర్‌ టెన్షన్‌ వల్లే అస్వస్థతకు గురైనట్లు వైద్యులు చెప్పారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. మరోవైపు మంత్రి మల్లారెడ్డి ఆస్పత్రి వద్ద ధర్నాకు దిగారు. తన కొడుకును చూడనివ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కుమారుడికి ఏమవుతుందోనని భయంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

Advertisement

సురారం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన కొడుకును చూసేందుకు వెళ్లిన మల్లారెడ్డిని సీఆర్‌పీఎఫ్‌ బలగాలు అడ్డుకున్నాయి. దీంతో మల్లారెడ్డి ఆసుపత్రి బయట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఇంకోవైపు ఐటీ సోదాల్లో నగదు, పలు కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మల్లారెడ్డి ఇంటివద్ద భారీగా సీఆర్‌పీఎఫ్‌ బలగాలను మోహరించి సోదాలు కొనసాగిస్తున్నారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×